డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వస్తుందా? డాక్టర్లు సూచించిన నివారణ మార్గాలివే
సాధారణంగా శరీరంలో నీటిశాతం తక్కువగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. అయితే డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వస్తుందా? అంటే వస్తుందనే చెబుతున్నాయి పలు అధ్యయనాలు. మరేం చేయాలంటే..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
చాలా మందిలో డీహైడ్రేషన్ సమస్య తరచూ కనబడుతూ ఉంటుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. సాధారణంగా డీహైడ్రేషన్ వల్ల నోరు పొడిబారడం, అలసట, కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు డీహైడ్రేషన్ తలనొప్పికి కూడా దారితీస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. తగినంత నీరు తాగకపోవడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. దానివల్ల తలనొప్పికి వస్తుంది.
డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?
డీహైడ్రేషన్ కారణంగా శరీరంలో రక్త పరిమాణం తగ్గుతుంది. మెదడుకు తక్కువ స్థాయిలో ఆక్సిజన్, పోషకాలు అంది.. తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్ వల్ల నాడి పనితీరు, కండరాల సంకోచానికి అవసరమైన సోడియం, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ కారణంగా మెదడు కణజాలం తాత్కాలికంగా కుంచించుకుపోతుంది. ఈ సంకోచం నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది. దీని వల్ల తరచూ తలనొప్పి వస్తుంది.
డీహైడ్రేషన్ లక్షణాలు
- దాహం కావడం. నీళ్లు తీసుకోవాలని సూచించే శరీర సహజ సంకేతం.
- నోరు, గొంతు పొడిబారటం: లాలాజల ఉత్పత్తి తగ్గి నోరు ఎండిపోయినట్లు అనిపిస్తుంది.
- అలసట, మైకం: డీహైడ్రేషన్ వల్ల అలసట, తలనొప్పి కలుగుతుంది. దీంతో మైకం వచ్చే అవకాశం ఉంది.
- ముదురు రంగులో మూత్రం: సాధారణం కంటే ముదురు రంగులో మూత్రం రావడం డీహైడ్రేషన్‌కి సంకేతం. సరిపడా నీళ్లు తాగితే మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది.
- చర్మం పొడిబారటం: డీహైడ్రేషన్ వల్ల చర్మం పొడిబారుతుంది. పొలుసులుగా కనిపిస్తుంది.
- కండరాల నొప్పులు: డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత వల్ల కండరాల నొప్పులు, తిమ్మిర్లు కలుగుతాయి.
డీహైడ్రేషన్ అవకుండా ఏం చేయాలి?
శరీరం డీహైడ్రేషన్ అవకుండా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. శారీరక శ్రమ, వాతావరణం, వ్యక్తిగత ఆరోగ్య అవసరాల్లాంటి అంశాల ఆధారంగా ప్రతిరోజూ కనీసం ఎనిమిది 8 గ్లాసుల నీరు తాగాలి. అధిక వ్యాయామం చేసినా, వేడి వాతావరణంలో ఉన్నా దానికి తగ్గట్టు నీరు తాగాలి.
కాఫీ, ఆల్కహాల్ విషయంలో జాగ్రత్త
బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచే ఆహార పదార్థాలు తినాలి. అంటే పుచ్చకాయలు, దోసకాయలలాంటి పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోండి.
కాఫీ, ఆల్కహాల్‌ను పరిమితంగా తీసుకోవాలి. ఈ రెండు డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబటి ఈ కాఫీ, ఆల్కహాల్‌ను బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవాలి. శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ తగనింత నీటిని తాగాలి.