అల్లు అర్జున్-అట్లీ మూవీ నుండి నిర్మాత అవుట్? అసలేం జరిగింది?
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ సినిమా నుండి నిర్మాత తప్పుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకని సన్ పిక్చర్స్ వెనక్కి తగ్గారు, దిల్ రాజు కూడా నో చెప్పారా?

Producer Walks Out of Atlee Allu Arjun Movie? in telugu
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ (Allu Arjun) – అట్లీ (Atlee Kumar) సినిమా మొదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తె లిసిందే. పుష్ప 2 తర్వాత చేసే చిత్రం కావటంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.
ఈ నేపద్యంలో మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల రూమర్స్, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అది మరేదో కాదు నిర్మాత ఈ ప్రాజెక్టు తాను చేయలేనని చేతులెత్తేసారని తమిళ సినిమా వర్గాల్లో వినిపిస్తోంది. తమిళ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి అసలేం జరిగిందో చూద్దాం.
Producer Walks Out of Atlee Allu Arjun Movie? in telugu
అట్లీ తన నెక్ట్స్ ప్రాజెక్టు ని సన్ పిక్చర్స్ కు చేస్తానని చాలా కాలం క్రితమే సైన్ చేసి అడ్వాన్స్ పుచ్చుకున్నారు. అయితే ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ వారు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. ఓ ప్రక్కన లైకా ప్రొడక్షన్ హౌస్ అప్పులతో ఇబ్బందులు పడుతున్న విషయం తమిళ ఇండస్ట్రీని చాలా జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోంది.
ఈ క్రమంలో బడ్జెట్, ప్లానింగ్ విషయంలో నిర్మాత..అట్లీ చెప్పే లెక్కలకు నో చెప్తున్నారట. మొదట అల్లు అర్జున్ తో ప్రాజెక్టు అనుకున్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో చేద్దామనుకుని, చివరకు అల్లు అర్జున్ దగ్గరకి వచ్చి ఆగారట. అయితే బడ్జెట్ నెగోషియేషన్స్ మాత్రం తేలకపోవటంతో నిర్మాతలు తాము ఇలా అయితే సినిమా చేయలేమని చెప్పాసి తప్పుకున్నారట.
Producer Walks Out of Atlee Allu Arjun Movie? in telugu
దాంతో దిల్ రాజు దగ్గర అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టినా గేమ్ ఛేంజర్ దెబ్బ గట్టిగా తగలటంలో ఆయన నో చెప్పారని వినపడుతోంది. ఏదైమైనా అల్లు అర్జున్ – అట్లీ అనగానే కాంబో పరంగా ఎక్సపెక్టేషన్స్ మామూలుగా ఉండవు.
దానికి తోడు అట్లీ కూడా ఫామ్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ సంగతి అసలు చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి కథ చెప్పడం ప్రాజెక్ట్ లాక్ అవ్వడం జరిగింది. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలనిని వినికిడి. అక్కడే నిర్మాత కు సమస్య మొదలైందిట.