శ్రీను వైట్ల నెక్ట్స్ సెట్టైంది, మైత్రీ బ్యానర్ లో, డిటేల్స్
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలతో వెలిగిన శ్రీను వైట్ల వరుస ఫ్లాపులతో వెనుకబడ్డారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్‌తో కొత్త సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. యంగ్ హీరోలతో చర్చలు జరుగుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Mythri backing Srinu Vaitla for his next in telugu
ఒకప్పుడు కామెడి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీను వైట్ల. ఢీ, రెడీ అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌లను అందించిన ఆయన మహేష్ బాబుతో దూకుడు అంటూ రికార్డులు కొల్లగొట్టాడు.
ఆ తరువాత వరస ఫ్లాఫ్ లతో శ్రీను వైట్ల డౌన్ ఫాల్ మొదలైంది. రీసెంట్ గా గోపచంద్ తో విశ్వం తీసారు. ఈ సినిమా ఎప్పటిలాగే డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా థియేటర్లలో సింగిల్ డిజిట్ షేర్ వసూలు చేసింది.
ఈ క్రమంలో శ్రీను వైట్ల తన నెక్ట్స్ ప్రాజెక్టు కు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రీను వైట్ల కొత్త మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ దర్శకుడి మైత్రీ ప్రొడక్షన్ కంపెనీ మళ్లీ ఛాన్స్ ఇవ్వబోతోన్నట్టుగా సమాచారం.
Mythri backing Srinu Vaitla for his next in telugu
గత కొన్ని నెలలుగా యంగ్ రైటర్స్ తో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. మైత్రీ బ్యానర్ లో ఓ ప్రాజెక్టు ఓకే అయ్యిందని తెలుస్తోంది. సామజవరగమన చిత్రంతో ప్రూవ్ చేసుకున్న రచయిత నందు చెప్పిన ఓ కథ ని ఓకే చేసి శ్రీను వైట్ల తన రైటర్స్తో వర్క్ చేస్తున్నారు.
మైత్రీ మూవీస్ కి చెందిన నవీన్ యర్నేని ఇప్పటికే స్క్రిప్టు విని ఓకే చేసి ప్రాజెక్టు ముందుకు తీసుకు వెళ్లటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ కథను శ్రీను వైట్ల రామ్ పోతినేని, నీవన్ పోలిశెట్టి, తేజ సజ్జ వంటి హీరోలకు చెప్పటానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ హీరోలంతా తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Mythri backing Srinu Vaitla for his next in telugu
మైత్రీ మూవీస్ వారు ..త్వరలో ఈ హీరోలతో మీటింగ్ ఎరేంజ్ చేయబోతున్నారు. హీరో సెట్ అయితే ఈ సంవత్సరం ద్వితాయార్దంలో మొదలు కావచ్చు. శ్రీను వైట్లను నమ్మి ఏ స్టార్ హీరో ఇప్పుడు డేట్లు ఇస్తారనే చర్చలు జరుగుతున్నాయి.
మరి శ్రీను వైట్ల చెప్పే కథను నమ్మి ఏ హీరో మందుకు వస్తాడో చూడాలి. ఈ సారి అయినా శ్రీను వైట్ల తన మీద నమ్మకం పెట్టుకునే ఆడియెన్స్‌ను మెప్పిస్తాడా? లేదా? అన్నది చూడాలి.