టాటూ కనిపించేలా చాలీచాలని టాప్‌లో వింక్ బ్యూటీ రచ్చ.. సెట్‌లో పవన్ ఎలా ఉంటాడో చెప్పిన ప్రియా ప్రకాష్..
కన్నుగీటుతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. వింకీ బ్యూటీ గా ఓవర్‌నైట్‌లో స్టార్ అయిన ఈ భామ ఇప్పుడు క్రేజీ ఆఫర్ అందుకుంది. పవన్‌తో `బ్రో` సినిమాలో నటిస్తుంది. త్వరలో రచ్చ చేసేందుకు రాబోతుంది.
వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కెరీర్ బిగినింగ్‌లోనే భారీ సినిమా ఆఫర్లు దక్కించుకుంటుంది. `ఇష్క్`, `చెక్` చిత్రాలతో మెరిసిన ఈ భామ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో `బ్రో` చిత్రంలో నటిస్తుంది. సాయిధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ మరో కథానాయిక. ఇందులో కేతికతోపాటు ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.
`బ్రో` సినిమా వచ్చే వారం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాష్ వారియర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. పవన్ సెట్‌లో ఎలా ఉంటారో తెలిపింది. ఆయన లెజెండ్ పర్సనాలిటీ అని చెప్పిన ప్రియా.. పవన్ సెట్‌లోకి వస్తుంటే ఓ ఆరా.. వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతా హడావుడి నెలకొంటుంది. ఆయన వస్తున్నారంటే ఆ హడావుడి వేరే లెవల్‌లో ఉంటుంది. సెట్ మొత్తం సెట్ అయిపోతారు. అంతా కామ్‌గా మారిపోతుంది.
పవన్ మాత్రం వచ్చాక చాలా సింపుల్‌గా ఉంటారు, దర్శకుడు ఏం చెబితే అది చేస్తారు, ఇలా చేయాలా? ఎలా చేయాలంటారు చేసేస్తారు. సింపుల్‌గా పక్కన చైర్‌లో కూర్చుంటారు. ఇంతటి గొప్ప స్థాయికి వెళ్లినా కూడా ఆయనలో సింప్లిసిటీ చూసి ఆశ్చర్యమేసింది. అది నాకు గొప్ప లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్ అని తెలిపింది ప్రియా ప్రకాష్ వారియర్. `కెరీర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి నటించే అవకాశం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. సినిమాలో ఆయన కాంబినేషన్ లో నాకు సన్నివేశాలు ఉన్నాయి. ఆయన తన నటనతో మ్యాజిక్ చేస్తారు. ఆయన సెట్ లో అడుగుపెడితేనే ఏదో అనుభూతి కలుగుతుంది. అది మాటల్లో చెప్పలేము` అని వెల్లడించిందీ వింకీ బ్యూటీ.
`బ్రో` సినిమా అవకాశం రావడంపై ఆమె రియాక్ట్ అవుతూ, `మా అమ్మ సూచనతో నేను అప్పటికే మాతృక `వినోదయ సిత్తం` చూశాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. `బ్రో` కోసం సముద్రఖని గారు ఫోన్ చేసి లుక్ టెస్ట్ కోసం రమ్మన్నారు. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లు పరిశీలించి, చివరికి నన్ను ఎంపిక చేశారు సముద్రఖని. నాలాంటి నూతన నటికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగమయ్యే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి అగ్ర నటులతో ఒకట్రెండు సన్నివేశాల్లో నటించడమే నాలాంటి వారికి గర్వంగా ఉంటుంది.
గత చిత్రాలతో పోలిస్తే ఇందులో కొత్తగా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు వీణ. హోమ్లీ గర్ల్ లాంటి క్యారెక్టర్. నాకు పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారి ఇద్దరితోనూ సినిమాలు సన్నివేశాలు ఉంటాయి. అయితే నా పాత్ర ఏం చేస్తుందనేది మాత్రం సస్పెన్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెరపైనే చూసి తెలుసుకోవాలి` అని పేర్కొంది ప్రియా ప్రకాష్ వారియర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి చెబుతూ, తనని బాగా చూసుకున్నారని తెలిపింది. ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లో పనిచేయడం సంతోషంగా ఉంది అని తెలిపింది వింకీ బ్యూటీ.
`సముద్రఖనికి ఏం కావాలో, నటీనటుల నుంచి ఏం రాబట్టుకోవాలో స్పష్టంగా తెలుసు. దర్శకుడిగా, నటుడిగా ఆయనకీ ఎంతో అనుభవం ఉంది. ఆయన సినిమాలో పని చేయడం నిజంగా ఆనందంగా ఉంది. కేతిక శర్మ కాంబినేషన్ లో కొన్ని సీన్లు ఉన్నాయి. మెయిన్ కాస్టింగ్ అందరితోనూ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఇదొక మంచి కుటుంబ చిత్రం. సాయి ధరమ్ తేజ్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటాడు. షూటింగ్ సమయంలో మంచి స్నేహితులయ్యాం. కేతిక, రోహిణి గారు, యువ అందరం సెట్స్ లో అందరం సరదాగా మాట్లాడుకునేవాళ్ళం` అని చెప్పింది.
కన్నుగీటుతో పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్.. ఆ తర్వాత వచ్చే అవకాశాలపై రియాక్ట్ అవుతూ, `నాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. నన్ను సరైన మార్గంలో గైడ్ చేసేవాళ్ళు లేరు. ఆ వీడియో తర్వాత అందరూ రకరకాల సలహాలు ఇవ్వడంతో కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు పాత్రలు, సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగానే నా అడుగులు సాగుతున్నాయి` అని చెప్పింది.
తెలుగు, మలయాళంకి ఉన్న డిఫరెన్స్ గురించి చెబుతూ, తెలుగు సినిమాల బడ్జెట్, మార్కెట్ చాలా పెద్దది. కానీ మలయాళంలో ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ లో చిన్న సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు తెలుగు, మలయాళం అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా అంటున్నారు. మన సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. `ఆర్ఆర్ఆర్` కి ఆస్కార్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు భాషతో సంబంధం లేదు` అని చెప్పింది ప్రియా.
ఈ సందర్భంగా ఆమె గ్లామరస్‌గా ముస్తాబై వచ్చింది. ట్రెండీ వేర్‌లో మంత్రముగ్దుల్ని చేస్తుంది ప్రియా ప్రకాష్ వారియర్. చాలీచాలనీ టాప్‌లో పరువాల విందు వడ్డించింది. కిల్లర్ చూపులతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇంకోవైపు నడుము అందాలు చూపిస్తూ మరింతగా రెచ్చగొడుతుంది. ఇప్పుడీ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. కన్నుగీటుతోనే కూడా అందాల విందుతోనూ ఆకట్టుకుంటుందీ హాట్ హీరోయిన్. తాజా ఫోటో షూట్‌లో ఆమె తన ఎదపై టాటూ చూపించడం విశేషం. దీంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.
ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కన్నుగీటుతో వచ్చిన క్రేజ్‌ని మెయింటేన్ చేస్తుంది. ఫ్యాన్స్ కి కావాల్సిందిస్తూ ఆకట్టుకుంటుంది. తనని తాను సర్వైవ్ చేసుకుంటుంది.