శివాజీ పెద్ద కన్నింగ్.. దామిని షాకింగ్ కామెంట్.. తెలుగులో బూతులు, ఇంగ్లీష్‌లో నీతులా.. నిలదీసిన గీతూ రాయల్
బిగ్ బాస్ తెలుగు 7 హౌజ్ నుంచి మూడో వారం స్టార్ సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యింది. అయితే శివాజీ, ప్రశాంత్‌లపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం.
బిగ్ బాస్ ఏడో సీజన్ మూడు వారాలు పూర్తి చేసుకుంది. 14 మందితో ప్రారంభమైన ఈ సీజన్ ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆదివారం సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యింది. అంతకు ముందు షకీలా, కిరణ్ రాథోర్ ఎలిమినేట్ అయ్యారు. కిచెన్ పరిమితమవుతూ, ముచ్చట్లతోనే టైమ్ పాస్ చేస్తున్న వారిని ఇంటికి పంపిస్తున్నారు బిగ్ బాస్.
ఇక మూడో వారం ఆదివారం.. దామిని ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఇంత తొందరగా వెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ `బిగ్ బాస్ బజ్`కి హోస్ట్ చేస్తున్న గత బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ మాత్రం ఊహించిందట. తన ఆట తీరుని బట్టి ఆమె ఎక్స్ పెక్ట్ చేసినట్టు చెప్పింది.
ఈ సందర్భంగా దామినిని ఇంటర్వ్యూ చేస్తూ ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకుంది. ప్రశ్నలతో చెడుగుడు ఆడుకుంది. తెలుగులో చెబితే బూతులు, ఇంగ్లీష్‌లో మాట్లాడితే నీతులా అంటూ నిలదీసింది. దీనికి ఆమె వద్ద సమాధానం లేదు. దీంతో తనని సీరియల్ కిల్లర్‌లా చూస్తున్నారనంటూ దామిని వాపోవడం గమనార్హం.
కెమెరా ముందు మాట్లాడితేనే తోపు అన్నప్పుడు మీరు కెమెరా ముందు ఎందుకు మాట్లాడలేదు అని గీతూ రాయల్ ప్రశ్నించగా, ప్రతి ఒక్కరు మేం తోపు మేం తోపు అని వ్యవహరిస్తున్నారంటూ ఆమె తనదైన హవభావాలతో దామని వెల్లడించడం విశేషం. మీరు పేడ కొట్టారా? దూద్ పేడ కొట్టారా? అని అడగ్గా అది టాస్క్ అని, అంటే ఓ మనిషిని ఊపిరి ఆడకుండా చేయోచ్చా అన్నప్పుడు అది కూడా టాస్క్ అంటూ తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేసింది దామిని. నేనేమైనా సీరియల్ కిల్లర్‌లా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించింది.
ఇక మీ దృష్టిలో `ఎఫ్..` వర్డ్స్ హార్ష్ లాంగ్వేజ్ కాదా?, తెలుగులో మాట్లాడితే బూతులు, ఇంగ్లీష్‌లో మాట్లాడితే నీతులా? అంటూ ప్రశ్నించింది గీతూ రాయల్. దీంతో దామిని మొహం వాడిపోయింది. గీతూకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతకు ముందు వరకు భిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో కవర్ చేసుకుంటూ వచ్చిన దామిని ఈ ప్రశ్నతో షాక్ కి గురైంది.
అనంతరం హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్ల గురించి చెబుతూ, రతిక.. సరిగా వినదని, సగం సగం వింటుందని, యావర్.. కొంచెం అర్థం చేసుకో అని, శుభశ్రీ బార్బీ డాల్‌లా రెడీ అవడం మానేసి అప్పుడప్పుడు పని చేస్తూ కూడా ఉండు, తేజ ఎటకారం తగ్గించుకోమని తెలిపింది దామిని.
శోభా శెట్టి గురించి చెబుతూ.. తేజని అన్ని పనులు చేయోద్దని చెప్పు అని దామిని అనగా, సో శోభా చెంచ్చా తేజ అని గీతూ అనగా, వెటకారంగా దామిని నవ్వింది. అనోచ్చంటూ రిప్లై ఇచ్చింది. గౌతమ్ అన్ని నీకే తెలుసని అనుకోకు అని, ప్రశాంత్ ప్రస్తావన రాగానే, ఆయన గురించి తాను మాట్లాడనని, పక్కన పెట్టండి అంటూ చెప్పింది. ఇక శివాజీ గురించి చెబుతూ పెద్ద కన్నింగ్ గేమ్ అంటూ వెల్లడించింది. చివరికి తనకు కేటాయించిన పవర్ అస్త్రని పగలకొట్టింది.