బాయ్ ఫ్రెండ్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన షకీలా.. అమ్మ చూసి ఆ పని చేయించిందంటూ ఎమోషనల్..
ఒకప్పటి శృంగార తార షకీలా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె తన గతం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది. తనని తాను మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.
షకీలా సౌత్ సినిమాని ఊపేసింది. శృంగార కథానాయికగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపేసింది. అప్పటి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా షకీలా నటించిన సినిమాలు ఆడటం విశేషం. ఇంకా చెప్పాలంటే వారి కంటే షకీలా సినిమాలకే క్రేజ్ ఉండేది.
shakeela protest
అయితే ఆ తర్వాత క్రమంగా వ్యాంప్ పాత్రలకు పరిమితమయ్యింది. తెలుగులోనూ చాలా సినిమాల్లో వ్యాంప్ రోల్స్ చేసింది. ఉర్రూతలూగించింది. ఇక్కడ కూడా షకీలాకి విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె అడపాదడపా రెగ్యూలర్ పాత్రలు చేస్తుంది. కానీ ఇటీవల అవి కూడా లేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆమె కమ్ బ్యాక్ కావాలనుకుంటుంది. మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటుంది.
Shakeela to participate in Bigg Boss Telugu 7
అందులో భాగంగా షకీలా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. ఆమె బిగ్ బాస్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్‌లో సందడి చేస్తుంది. ఇప్పుడు తాను షకీలా అమ్మగా పిలిపించుకోవాలని, షకీలా అమ్మగా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో షకీలా బిగ్ బాస్‌కి వెళ్లడానికి ముందు ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన లవ్ స్టోరీ, ప్రెగ్నెంట్, అబార్షన్ వంటి విషయాలను బయటపెట్టింది.
షకీలా తాను నటిగా ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో ఓ వ్యక్తిని ప్రేమించిందట. అతని కారణంగా ప్రెగ్నెంట్ కూడా అయినట్టు చెప్పింది. కానీ అప్పటికి తనది చాలా చిన్న ఏజ్ కావడంతో అబార్షన్ చేయించుకుందట. తాను పిల్లలను కనడం వాళ్ల అమ్మకి ఇష్టం లేదని, అందుకే తీసేయించిందట. అయితే తాను ప్రెగ్నెంట్ అనే విషయం కూడా తనకు చాలా లేట్ గా తెలిసిందట. తనకు పీరియడ్స్ రెగ్యూలర్‌గా ఉండకపోవడంతో ప్రెగ్నెంట్ అనే విషయాన్ని గ్రహించలేదు. దీంతో తాను కూడా లైట్ తీసుకుందట.
కానీ తన పొట్ట పెరగడం చూసిన షకీలా మదర్ డాక్టర్ వద్దకి తీసుకెళ్లిందట. అప్పుడు తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందని, ఆ టైమ్‌లో తనది పిల్లలు కనే వయసు కాదని, ఆ టైమ్‌లో సరైనది కాదని అమ్మ తనకు అబార్షన్ చేయించిందట. ఒకవేళ తాను పిల్లల్ని కని ఉంటే బిడ్డలో లోపాలు ఉండొచ్చు అని చెప్పింది. అందుకే ఆ సమయంలో తాను చేసింది సరైనదే అని చెప్పింది షకీలా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికీ తాను తన లవర్‌తో టచ్‌లోనే ఉంటుందట.
ఇక ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసిన షకీలా ఆ తర్వాత తాను తన ఇమేజ్ నుంచి బయటపడేందుకు టీవీ షోస్ కూడా చేసింది. `కుక్ విత్ కోమలి` అనే వంటల ప్రోగ్రామ్ కూడా చేసింది. మెప్పించింది. ఆ తర్వాత కన్నడలో బిగ్ బాస్ షోలోనూ పాల్గొంది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్‌లో సందడి చేస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే షకీలా ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ ని పెంచుకుంది. వారికి తనే లోకంలా, తనకు వారేలోకంలా జీవిస్తున్నట్టు ఇటీవల షోలో వెల్లడించింది.