MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాస్పిటల్ లో సైఫ్ అలీఖాన్: దేవర 2 పరిస్థితి ఏంటి..?

హాస్పిటల్ లో సైఫ్ అలీఖాన్: దేవర 2 పరిస్థితి ఏంటి..?

జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర సినిమా మొదటి భాగం మంచి విజయాన్ని సాధించింది. అయితే, సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కారణంగా దేవర 2 షూటింగ్ ఆలస్యం కానుంది.

2 Min read
Surya Prakash
Published : Jan 19 2025, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ntr, devara2, koratala shiva

ntr, devara2, koratala shiva

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ చిత్రం ''దేవర''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్.. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ నడుమ సెప్టెంబర్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటకీ, దానితో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీగానే వసూళ్లు రాబట్టి షాక్ ఇచ్చింది. అలాగే సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ ఈ చిత్రాన్ని ముగించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు  'దేవర 2' ఎప్పుడు మొదలవుతుంది అనే డిస్కషన్ చేసుకుంటున్నారు.
 

26
Junior NTRs Devara India collection report out

Junior NTRs Devara India collection report out


దర్శకుడు కొరటాల శివ 'దేవర' పార్ట్-2 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.  స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు తన టీమ్ తో గత కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. అంతేకాదు వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, షూటింగ్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. అయితే ఇప్పుడు దేవర లో కీలకమైన విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్  పై దాడి జరగటంతో ఈ విషయం మరోసారి డిస్కషన్ కు వచ్చింది.

36
koratala siva should take a one month break before doing devara part 2 says ntr jr

koratala siva should take a one month break before doing devara part 2 says ntr jr


 ఇప్పుడు సైఫ్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన కోలుకుని తను కమిటైన ప్రాజెక్టులు ఫినిష్ చేయాలి. ఆ తర్వాత దేవర 2 దగ్గరకు రావాలి. గాయం చాలా తీవ్రంగా తగిలింది కాబట్టి కోలుకోవటానికి చాలా టైమ్ పట్టచ్చు అంటున్నారు. ఈ క్రమంలో దేవర 2 షూటింగ్ ఈ సంవత్సరం జరగకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. మరో ప్రక్క ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు, అలాగే వార్ 2 సినిమాలు పూర్తి చేయాలి. 

46
Junior NTRs Devara global collection report out earns 466 crore rupees

Junior NTRs Devara global collection report out earns 466 crore rupees


దేవర రిలీజ్ తర్వాత కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దేవర 2'లో వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటుందని, వర వీర విహారం చూస్తారని చెప్పారు. ఇంకా చాలా పెద్ద కథ ఉంది. ఫస్ట్ పార్ట్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. సెకండ్ పార్ట్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. చాలా పాత్రలు వేరే షేప్ తీసుకుంటాయి.

పాత్రల మధ్య డ్రామా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. దేవర, వర మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. దేవర కథలు వింటూ పెరిగిన వర.. అమితంగా ఇష్టపడే తన తండ్రి గుండెల్లోకి ఎందుకు కత్తి దింపాల్సి వచ్చింది?, అంత పెద్ద త్యాగం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? దేవర గురించి వర ఏం కథ రాసాడు? అసలు దేవరను ఏం చేసాడు? వంటి అంశాలు పార్ట్-2లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని కొరటాల తెలిపారు. 
 

56
Ntr, Devara, koratala shiva

Ntr, Devara, koratala shiva

ఇక  బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆరు కత్తిపోట్లకు గురైన సైఫ్‌.. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అత్యవసర శస్త్రచికిత్సలు చేశామని, ప్రాణాపాయం ఏమీ లేదని, రెండ్రోజుల్లో నాన్‌-ఐసీయూ విభాగానికి మారుస్తామని వైద్యులు తెలిపారు.  

66

‘ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన వేగంగా కోలుకుంటున్నారు. సైఫ్ మెళ్లిగా నడుస్తున్నారు. భయపడాల్సిందేమీ పనిలేదు. పెరాలసిస్ రిస్క్ కూడా లేదు. ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు షిఫ్ట్ చేశాం. అయితే వారం వరకు ఆయన్ను విజిటర్స్ కలవడానికి లేదు. వెన్ను గాయం కారణంగా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

అందుకే ఎవర్నీ అనుమతించడం లేదు. ఆయన హాస్పిటల్‌లోకి వచ్చినప్పుడు రక్తంతో తడిసిపోయి ఉన్నారు. అయినా సింహంలా నడుచుకుంటూ వచ్చారు. స్ట్రెచర్ కూడా వాడలేదు. ఆయన రియల్ హీరో. సైఫ్ అదృష్టవంతుడు. ఆయన వెన్నులోకి దిగిన కత్తి మరో 2 మిల్లీమీటర్లు లోపలకు వెళ్లి ఉంటే ప్రాణానికే ప్రమాదం వచ్చేది’ అని సైఫ్‌కు చికిత్స అందిస్తున్న లీలావతి హాస్పిటల్ డాక్టర్ నితిన్ నారాయణ్ చెప్పుకొచ్చారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved