Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Pragathi: ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులోనే చేయాలి.. ప్రగతి జిమ్ వర్కౌట్స్ పై సెటైర్లు

Pragathi: ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులోనే చేయాలి.. ప్రగతి జిమ్ వర్కౌట్స్ పై సెటైర్లు

ఇటీవల కాలంలో జబర్దస్త్ షోలో చాలా మార్పులు జరిగాయి. సుడిగాలి సుధీర్, అనసూయ లాంటి వారు జబర్దస్త్ వీడారు. జడ్జిలు కూడా మారారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకి నటి ఇంద్రజ, ప్రగతి జడ్జ్ లుగా చేస్తున్నారు.

team telugu | Published : Aug 08 2022, 01:32 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఇటీవల కాలంలో జబర్దస్త్ షోలో చాలా మార్పులు జరిగాయి. సుడిగాలి సుధీర్, అనసూయ లాంటి వారు జబర్దస్త్ వీడారు. జడ్జిలు కూడా మారారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకి నటి ఇంద్రజ, ప్రగతి జడ్జ్ లుగా చేస్తున్నారు. లేటెస్ట్ జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది. ఎప్పటిలాగే కామెడీ పంచ్ లతో ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. 

26
Asianet Image

చలాకి చంటి, నూకరాజు, రాకెట్ రాఘవ ఇలా ప్రతి ఒక్కరి స్కిట్స్ మంచి హాస్యం పండిస్తున్నాయి. చలాకి చంటి ముగ్గురు చెల్లెళ్లకు అన్నగా స్కిట్ చేశారు. చెల్లెళ్ళ పెళ్లి అయ్యే వరకు ఇంకా పెళ్లి చేసుకొని అన్నగా చలాకి చంటి కనిపిస్తున్నారు. 

36
Asianet Image

కమెడియన్ నూకరాజు, దొరబాబు కలిసి చేసిన స్కిట్ నవ్వులు పూయిస్తోంది. సూర్యవంశం మూవీ పేరడీ చేశారు. ఈ స్కిట్ లో దొరబాబు పెద్ద వెంకటేష్ పాత్రలో నటించాడు. నేను నా పెద్ద కొడుకుని పోలీస్ చేశా.. రెండో కొడుకుని లాయర్ ని చేశా.. ఎందుకో తెలుసా అని దొరబాబు అడుగుతారు. దీనికి నూకరాజు బదులిస్తూ.. నాకు తెలుసు మీరు ఎక్కడైనా దొరికేస్తారు అంటూ దొరబాబు సెక్స్ రాకెట్ వ్యవహారం గుర్తొచ్చేలా సెటైర్ వేసారు. 

46
Asianet Image

దీనితో ప్రగతి, ఇంద్రజ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక రాకెట్ రాఘవ.. నటి ప్రగతిపై సెటైర్లు వేస్తూ చేసిన స్కిట్ హైలైట్ గా నిలిచింది. ప్రగతి గారు మీతో ఎప్పుడూ ఒక విషయం చెప్పాలనిపిస్తూ ఉంటుంది అంటూ జిమ్ వర్కౌట్లు మొదలు పెడతాడు. 

56
pragathi

pragathi

రాఘవ జిమ్ వర్కౌట్లు చేస్తూనే ప్రగతితో మాట్లాడుతూ ఉంటాడు. దీనితో ప్రగతి నవ్వు ఆపుకోలేకపోతుంది. కాసేపటికి రాఘవ అలసిపోతాడు. పక్కనే ఉన్న వ్యక్తి.. అందుకే ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలి అని అంటాడు. దీనితో రాఘవ.. ప్రగతి గారిని పట్టుకుని అంత మాట అంటావా అని ప్రసిస్తాడు. 

66
pragathi

pragathi

నేను అనింది ఆవిడని కాదు నిన్నే అని చెప్పడంతో నవ్వులు పూస్తాయి. తన గురించి చేసిన ఈ స్కిట్ ని ప్రగతి బాగా ఎంజాయ్ చేసినట్లు ఉంది. ఈ పూర్తి ఎపిసోడ్ ఆగష్టు 11న ప్రసారం కానుంది. ప్రగతి ఈ వయసులో కూడా జిమ్ కసరత్తులతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories