- Home
- Entertainment
- Prabhas first look from Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్, దెబ్బకి అంచనాలు పెంచేశాడుగా.. హైలైట్ అదే
Prabhas first look from Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్, దెబ్బకి అంచనాలు పెంచేశాడుగా.. హైలైట్ అదే
Prabhas first look from Kannappa: ప్రభాస్ బిజీగా ఉంటూ కూడా మంచు విష్ణు కోసం కన్నప్ప చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించేందుకు ప్రభాస్ అంగీకరించారు. ఎప్పటి నుంచో ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని ఊరిస్తూనే ఉంది.

Prabhas, Kannappa movie
Prabhas first look from Kannappa: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మల్టిపుల్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు రాజా సాబ్ చిత్రంలో నటిస్తూనే, హను రాఘవపూడి ఫౌజి చిత్రం కూడా మొదలు పెట్టాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ చిత్ర షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది.
ప్రభాస్ ఇంత బిజీగా ఉంటూ కూడా మంచు విష్ణు కోసం కన్నప్ప చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించేందుకు ప్రభాస్ అంగీకరించారు. ఎప్పటి నుంచో ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని ఊరిస్తూనే ఉంది. ఈ చిత్రంలో మహాశివుడు పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ముందుగా ఆ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు అని వార్తలు వచ్చాయి. తాజాగా ప్రభాస్ లుక్ ఎట్టకేలకు విడుదలయింది. లుక్ అదిరిపోయింది అని చెప్పొచ్చు. రుద్ర అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు.
Prabhas First look
అఘోర తరహాలో ప్రభాస్ గెటప్ ఉంది. మెడలో రుద్రాక్ష మాలలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ గెటప్ లో దైవత్వం కనిపిస్తోంది. దైవ సంరక్షకుడిగా ప్రభాస్ ఈ పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ పాత్రలో ఎలివేషన్ ఇచ్చారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పాలకుడు అని పోస్టర్ లో ఉంది. తప్పకుండా ప్రభాస్ పాత్ర కన్నప్ప చిత్రానికి పాజిటివ్ అవుతుంది అని చెప్పడం లో సందేహం లేదు.