MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగాస్టార్ కూడబెట్టిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఖరీదైన బంగ్లా, లగ్జరీ కార్లు... ఎన్ని కోట్లు సంపాదించారంటే!?

మెగాస్టార్ కూడబెట్టిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఖరీదైన బంగ్లా, లగ్జరీ కార్లు... ఎన్ని కోట్లు సంపాదించారంటే!?

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ అగ్రహీరోగా ఎన్నో సినిమాలు చేసి.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు చిరు పుట్టిన రోజు సందర్భంగా.. ఇన్నేళ్లలో చిరు కూడబెట్టిన ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుందాం..
 

Sreeharsha Gopagani | Updated : Aug 22 2023, 11:19 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

టాలీవుడ్ అగ్రహీరోగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చెరగని ముద్ర వేసుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. యువ దర్శకులు, నటీనటులకు తన సినిమాల ద్వారా అవకాశాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈరోజు మెగాస్టార్ పుట్టిన రోజు కావడం విశేషం.
 

26
Asianet Image

1955 ఆగస్టు 22న కొణిదెల శివశంకర వరప్రసాద్ జన్మించిన విషయం తెలిసిందే. 1978 నుంచి నటుడిగా తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఇప్పటికీ 150కి పైగా సినిమాలు చేశారు. చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. నటనారంగంలో సంచలనంగా మారారు. ఇంతటీ సక్సెస్ ను చూసిన చిరంజీవి ఎన్ని కోట్లు కూడబెట్టారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. 
 

36
Asianet Image

సినిమాలు, పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. అంజనా ప్రొడక్షన్ హౌజ్ ద్వారా చిరు ఆస్తులు కూడబెట్టారు. చిరుకు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే బంగ్లా ఉన్న విషయం తెలిసిందే. అందులో సకల సౌకర్యాలు ఉండేలా నిర్మించుకున్నారు. దాని విలువ రూ.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అలాగే కోట్లు విలువ చేసే ఫామ్‌హౌస్ కూడా బెంగళూరులో ఉంది. 
 

46
Asianet Image

అదే విధంగా చిరంజీవి దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఖరీదైన ఆటోమొబైల్స్  కలెక్షన్స్  విషయానికొస్తే.. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ. 9-10.5 కోట్లు), రేంజ్ రోవర్ (రూ. 4 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ (సుమారు రూ. 2.2 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (రూ. 2 కోట్లు)తో పాటు ఆస్టన్ మార్టిన్ v8 వాన్టేజ్ కూడా ఉంది. అదేవిధంగా చిరు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా కలిగి ఉన్నారు.
 

56
Asianet Image

ఇక చిరు పలు వ్యాపారాల ద్వారా కూడా ఇన్ కమ్ కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇలా మొత్తంగా చిరంజీవి ఆస్తుల విలువ రూ.1,650కోట్లు ఉంటుందని అంటున్నారు. చిరు సంపాదించడంతో పాటు ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’, తదితర కార్యక్రమాలతో ప్రజా సేవ కూడా చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా వ్యాపారాల ద్వారా కోట్లల్లో సంపాదిస్తున్నారు. 
 

66
Asianet Image

నేటితో చిరు 68వ ఏటా అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, మెగా ఫ్యామిలీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. ఆయన మరింత ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని సినిమాలు చేసి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నారు. చివరిగా చిరు ‘భోళా శంకర్’తో అలరించారు. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై అప్డేట్స్ అందనున్నాయి. 
 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories