డ్రగ్స్ కి బానిసైన హీరో భార్యతో విడిపోయాడు...నాతో డేటింగ్ చేశాడు..!
బాలీవుడ్ కాంట్రవర్సియల్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరోకి డ్రగ్స్ అలవాటుంది అన్నారు. కాగా ఓ స్టార్ హీరో డ్రగ్స్ అలవాటు వల్ల భార్యతో విడిపోయాడని, ఆ తరువాత అతనితో నేను డేటింగ్ చేశానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రోజుకో సంచనల ఆరోపణలు చేస్తుంది. ఈమె చాలా కాలంగా బాలీవుడ్ ప్రముఖులపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కంగనా సిస్టర్ రంగోలి సైతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మరియు హీరోలు, దర్శక నిర్మాతలపై తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక సుశాంత్ మరణం తరువాత కంగనాకు పెద్ద సపోర్ట్ వచ్చి చేరింది.
చాలా కాలంగా ఆమె చేస్తున్న యుద్ధానికి సుశాంత్ ఫ్యాన్స్ మద్దతు దొరికినట్లు అయ్యింది. దీనితో ఆమె మరింత లోతుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా సుశాంత్ డెత్ కేసులో డ్రగ్స్ కోణం బయటపడింది. సుశాంత్ కి డ్రగ్స్ తెలియకుండా రియా అలవాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కొందరు డ్రగ్ డీలర్స్ తో రియా చక్రవర్తి వాట్స్ అప్ చాట్ చేసినట్లు ఆధారాలు దొరికాయి.
దీనితో బాలీవుడ్ డ్రగ్ కల్చర్ పై కంగనా కొన్ని సంచల వ్యాఖ్యలు చేశారు. దాదాపు 95శాతం మంది హీరోలు, హీరోయిన్స్ కి ఈ డ్రగ్స్ అలవాటు ఉందని ఆమె చెప్పారు. పరిశ్రమలోకు చెందిన ప్రముఖులు ప్రైవేట్ పార్టీలలో ఈ డ్రగ్స్ వాడుతారని ఆమె చెప్పారు.
అలాగే ఓ స్టార్ హీరోకి డ్రగ్స్ అలవాటు ఉండడం వలన ఇంటిలో అనేక సమస్యలు తలెత్తాయని చెప్పారు. దానితో ఆ హీరోకి భార్య విడాకులు ఇవ్వగా, ఆ తరువాత నేను డేటింగ్ చేశానని చెప్పి సంచలనానికి తెరలేపింది. అలాగే తనకు గురువుగా చెప్పుకొనే ఓ డైరెక్టర్ కి కూడా డ్రగ్స్ అలవాటు ఉందని ఆమె చెప్పారు.
ఆమె చెప్పిన ఆ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ అని ఈజీగా అర్థం అవుతుంది. హ్రితిక్ రోషన్ 2014లో భార్య సుసానా ఖాన్ నుండి విడాకులు తీసుకున్నారు. ఇక హ్రితిక్ తో తనకు ఎఫైర్ ఉందని, అతను శారీరకంగా వాడుకున్నాడని కంగనా రెండేళ్లు న్యాయపోరాటం చేసింది. ఇక కంగనా చెవుతున్న ఆ డైరెక్టర్ మహేష్ భట్ అని టాక్.