Rakul Preeth Singh: పద్దతిగా పరువాలు ఎరవేసిన రకుల్ ప్రీత్ సింగ్... కవ్వించే చూపులకు కుర్రాళ్ళు బేజారు!
టాలీవుడ్ స్టార్ లేడీగా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఆమె వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా సాంప్రదాయ బట్టల్లో మెస్మరైజ్ చేసింది.
Rakul Preeth Singh
రకుల్ ప్రీత్ సింగ్ సాంప్రదాయ బట్టల్లో నిండుగా కనిపించారు. ఈ జీరో సైజ్ భామ లేటెస్ట్ లుక్ ఆమెలోని నయా యాంగిల్ పరిచయం చేస్తుంది. ట్రెడిషన్ వేర్లో కూడా అమ్మడు అందాలు కవ్విస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
Rakul Preeth Singh
ఆ మధ్య వరుస పరాజయాలతో రకుల్ ఇబ్బంది పడింది. ఈ ఏడాది ఛత్రీవాలి మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. ఇది జీ5 లో నేరుగా విడుదల చేశారు. అలాగే బూ, లవ్ టైటిల్స్ తో రెండు చిత్రాలు చేసింది. ఇవి కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జియో సినిమాలో నేరుగా విడుదల చేశారు.
Rakul Preeth Singh
ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. భూమి పెడ్నేకర్ మరొక హీరోయిన్. మద్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ లో స్టార్ కావాలని రకుల్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
Rakul Preeth Singh
రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2024 ఆగస్టు 15న విడుదల కానుందని సమాచారం. మరో తమిళ చిత్రం అయలాన్ లో రకుల్ నటిస్తున్నారు.
Rakul Preeth Singh
టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు. రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మేకర్స్ ఆమెను పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క తెలుగు చిత్రం లేదు.
Rakul Preeth Singh
మరోవైపు పెళ్లి పుకార్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. 2021లో రకుల్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదన్న మాట వినిపించింది.2023లో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ఏడడుగులు వేయడం ఖాయం అంటుకున్నారు. రకుల్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు..