Catherine Tresa: పాల రోజా డ్రెస్ లో విరబూసిన కేథరిన్ పరువాలు... చూపులతో చంపేస్తుంది బాబోయ్!
దుబాయ్ భామ కేథరిన్ ట్రెసా అలెగ్జాండర్ పరువాల ఎర వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. కేథరిన్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Catherine Tresa
హీరోయిన్ కేథరిన్ పాల రోజా డ్రెస్ లో పరువాల విందు చేశారు. కవ్వించే చూపులతో హృదయాలు కొల్లగొట్టారు. అమ్మడు అందాలు కవ్విస్తుంటే సోషల్ మీడియా జనాలు థ్రిల్ అవుతున్నారు.
Catherine Tresa
కేథరిన్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటిపోయింది. కన్నడ మూవీ శంకర్ ఐపీఎస్ తో వెండితెరకు పరిచయమైంది. చమ్మక్ చల్లో కేథరిన్ మొదటి తెలుగు చిత్రం. ఆ సినిమా అంతగా ఆడకున్నా ఆఫర్స్ క్యూ కట్టాయి. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
Catherine Tresa
ఇద్దరమ్మాయిలతో యావరేజ్ టాక్ అందుకుంది. పైసా, ఎర్ర బస్, రుద్రమదేవి చిత్రాల్లో కేథరిన్ నటించారు. అయితే వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో రేసులో వెనకబడింది. స్టార్ హీరోయిన్ అని అనిపించుకోలేకపోయింది.
Catherine Tresa
మరోసారి అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ దక్కించుకున్న కేథరిన్ సరైనోడు లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ చిత్రంలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది. సరైనోడు మంచి విజయం సాధించింది.
Catherine Tresa
సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేశారు. జయ జానకీ నాయక మూవీలో ఐటం సాంగ్ చేసింది. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీలో ఓ హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాంతో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంది.
గత ఏడాది బింబిసార మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. మాచర్ల నియోజకవర్గం ప్లాప్ కాగా 2023 సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్యలో రవితేజ భార్య రోల్ చేసింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా విశ్వాసంతో ముందుకు వెళుతుంది.