- Home
- Entertainment
- Aishwarya Rajesh Tweet : హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. జాగ్రత్త అంటూ ట్వీట్..
Aishwarya Rajesh Tweet : హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. జాగ్రత్త అంటూ ట్వీట్..
హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ (Rajesh) సోషల్ మీడియా పేజ్ హ్యాక్ అయ్యింది. ఇదే విషయాన్ని ఐశ్వర్య ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సెలబ్రెటీలకు, అభిమానులకు మధ్య వారధిలా పనిచేస్తుంటుంది సోషల్ మీడియా ప్లాట్ ఫాం. స్టార్ హీరోల నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ వరకు అందరూ ఇన్ స్టా, ట్విట్టర్ లో తెగ యాక్టివ్ గా ఉంటారు. ఈ మాధ్యమం ద్వారానే తమ ఫ్యాన్స్ ను తరుచూ పలకరిస్తూ ఉంటారు.
అయితే గత కొంత కాలం సెలబ్రెటీల సోషల్ మీడియా పేజ్ లకు రక్షణ లేకుండా పోతుంది. పోలిటిక్ లీడర్స్ తో పాటు ఫిల్మ్ సెలబ్రిటీల సోషల్ మీడియా పేజ్ లు వరుసగా హ్యాక్ అవుతున్నాయి.
రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ (Yami Gautam) పేజ్ ను కూడా హ్యాక్ చేశారు. ఈ మేరకు తన అభిమానులు, సోషల్ మీడియా ఫ్రెడ్స్ ను అలర్ట్ చేస్తూ యామీ నోట్ కూడా రిలీజ్ చేసింది. తాజాగా తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh) కూడా ఈ సమస్యను ఎదుర్కొంది.
ఐశ్వర్యా రాజేశ్ ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయినట్టు ట్విట్టర్ లో ద్వారా ఈ హీరోయిన్ తెలిపింది. తన అకౌంట్ హ్యాంక్ అయ్యి అన్న ఉండొచ్చు.. లేదంటే ఏ కారణం చేతనైనా సస్పెండ్ అయినా అయ్యి ఉండొచ్చు అంటూ ట్వీట్ లో పేర్కొంది.
ఈ సందర్భంగా తన అకౌంట్ ను త్వరగా రీసాల్వ్ చేయాలని ఇన్ స్టా గ్రామ్ ప్రతినిధులను కోరింది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరింది. ఎలాంటి పోస్టులు, ప్రకటనలను స్పందించకూడదని పేర్కొంది.
ఐశ్వర్య రాజేశ్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితం. చివరిగా ఐషు ‘టక్ జగదీష్, రిపబ్లిక్’ చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం వరుసగా ఐదారు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. మరో తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.