Gandhi Jayanti: మహాత్ముడి ఔన్నత్యం తెలియజేసే బెస్ట్ మూవీస్ ఇవే!
ఎందరో మహనీయుల త్యాగఫలం స్వాతంత్య్రం. వారిలో ముందుగా వినిపించే పేరు గాంధీజీ. జాతిపితగా ఖ్యాతిగాంచిన గాంధీ ప్రపంచానికి శాంతి మార్గం చూపారు. అహింస ద్వారా కూడా యుద్దాన్ని గెలవొచ్చని నిరూపించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Gandhi Jayanti
1869 అక్టోబర్ 2న జన్మించిన గాంధిజీ జయంతి నేడు. గాంధీ జీవితం అనేక తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు కొన్ని సినిమాలు తెరకెక్కాయి. ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆయన మీద తెరకెక్కిన కొన్ని చిత్రాలు చూద్దాం...
1982లో వచ్చిన 'గాంధీ' చిత్రంలో గాంధీగా హాలీవుడ్ నటుడు బెన్ కింగ్ స్లే గొప్పగా నటించారు. రిచర్డ్ అటెన్ బరో రూపొందించిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. అప్పట్లో భారీ విజయం సాధించింది.
గాంధీ మూవీ అనంతరం `ది మేకింగ్ ఆఫ్ మహాత్మ` అనే చిత్రం చేశారు. ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనగల్ ది మేకింగ్ ఆఫ్ మహాత్మ చిత్రానికి దర్శకత్వం వహించారు. సౌత్ ఆఫ్రికాలో గాంధీ వున్న నాటి రోజుల నేపథ్యంలో దీన్ని నడిపించారు. గాంధీజీ శాంతి, అహింసా మార్గాలు ఎంచుకోవడానికి స్ఫూర్తిగా నిలిచిన సంఘటనలతో తెరకెక్కించారు.
ఇక 2000 సంవత్సరంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన చిత్రం హే రామ్. హే రామ్ మతాల పరంగా వివాదాలు రాజేసింది . షారుక్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఈ మూవీ అనుకున్నంతగా ఆడలేదు.
2006లో గాంధీజీ మార్గం ఈ తరానికి అర్థం అయ్యేలా లగేరహో మున్నా భాయ్ అనే చిత్రం చేశారు. సంజయ్ దత్ హీరోగా నటించారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన లగేరహో మున్నాభాయ్ సూపర్ హిట్.
Gandhi Jayanti
లగేరహో మున్నాభాయ్` సినిమాను తెలుగులోనూ శంకర్ దాదా జిందాబాద్‌గా రూపొందించారు. ఈ మూవీలో చిరంజీవి మహాత్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. చిరంజీవి ఇమేజ్ రీత్యా తెలుగులో పరాజయం పాలైంది.
ఇక గాంధీ ఎమోషనల్ డ్రామాగా `గాంధీ మై ఫాదర్` తెరకెక్కింది. ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాంధీపై తెరకెక్కించిన చిత్రాల్లో బెస్ట్ అనొచ్చు.
Gandhi Jayanti
దర్శకుడు కృష్ణ వంశీ మహాత్మ టైటిల్ తో పొలిటికల్ డ్రామా తెరకెక్కించారు. శ్రీకాంత్ వందవ చిత్రంగా తెరకెక్కిన మహాత్మ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. శ్రీకాంత్ నటన, డైలాగ్స్ బాగుంటాయి.