MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాబీ నెక్స్ట్ మూవీకి చిరు షాకింగ్ కండీషన్! కారణం అదేనా?

బాబీ నెక్స్ట్ మూవీకి చిరు షాకింగ్ కండీషన్! కారణం అదేనా?

Chiranjeevi:  డైరెక్టర్ బాబీ నెక్స్ట్ ప్రాజెక్టుకు చిరంజీవితో ఉండే అవకాసం కనపడుతోంది. ఇప్పటికే బాబి కథ చెప్పి ఒప్పించారట. అయితే చిరంజీవి మాత్రం ఓ షాకింగ్  కండీషన్ పెట్టారట. 

Surya Prakash | Published : Mar 09 2025, 10:37 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Director Bobby Strategic Efforts to Optimize Budget for Chiranjeevi's Movie?  in Telugu

Director Bobby Strategic Efforts to Optimize Budget for Chiranjeevi's Movie? in Telugu

Chiranjeevi: అతి తక్కువ టైమ్ లో తెలుగులో పెద్ద స్టార్స్ అందరితో సినిమాలు చేసిన ఘనత దర్శకుడు బాబిదే.   డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) ఇటీవల తన తాజా చిత్రం "డాకు మహారాజ్" తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఈ నేపథ్యంలో, బాబి నెక్ట్స్ ప్రాజెక్టు కు హీరో సెట్ అవటం కష్టంగానే ఉంది. చిరంజీవి ఓకే చేసినా ఓ కండీషన్ పెట్టరని తెలుస్తోంది. చిరంజీవికి ఇప్పటికే బాబి ఓ కథ చెప్పి ఒప్పించారని, అయితే చిరంజీవి చాలా క్లియర్ గా  బాబీని ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించాల్సిందిగా చెప్పారని సమాచారం.
 

23
Director Bobby Strategic Efforts to Optimize Budget for Chiranjeevi's Movie?  in Telugu

Director Bobby Strategic Efforts to Optimize Budget for Chiranjeevi's Movie? in Telugu


బాబీ టాలెంట్, మాస్ సెన్సిబిలిటీస్ గురించి సందేహమే లేదు. కానీ, ప్రస్తుత మార్కెట్‌లో ఖర్చులను పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోకపోతే, సినిమాలు లాభాలను తీసుకురావడం కష్టమే.

 బాబి ఎక్కువగా కెమెరామెన్ పైనా, ఫైట్ మాస్టర్స్ పైనా ఎక్కువ ఖర్చుపెట్టి ఆధారపడుతున్నారు. ప్రొడక్షన్ లో ఎక్కువ ఖర్చు దీనికే అవుతోంది. దాంతో ఈ ఖర్చుని గణనీయంగా తగ్గించుకుంటే తమ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్దామని చెప్పారట.

తన కెరీర్ లో వాల్తేరు వీరయ్య వంటి హిట్ ఇచ్చిన బాబి అంటే ఇష్టం ఉన్నా, ప్రస్తుత పరిస్దితులను దృష్టిలో పెట్టుకుని చిరు ఈ కండీషన్ పెట్టారట.అందుకు కారణం "డాకు మహారాజ్" మాత్రం ఆశించిన స్థాయిలో రాణించకపోవటమే అంటున్నారు.  భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా లాభాల కోసం నిర్మాతలకు పెద్దగా ఏమీ మిగలనివ్వలేదు. ఈ విషయం స్వయంగా నిర్మాత నాగవంశీనే మీడియాతో చెప్పారు. 

33
Director Bobby Strategic Efforts to Optimize Budget for Chiranjeevi's Movie?  in Telugu

Director Bobby Strategic Efforts to Optimize Budget for Chiranjeevi's Movie? in Telugu


బాబీ సినిమాల్లో సాధారణంగా మాస్ ఎలిమెంట్స్, స్టైలిష్ మేకింగ్, పవర్‌ఫుల్ పాత్రలే ప్రధాన ఆకర్షణలు. అయితే, "డాకు మహారాజ్" విషయంలో, కథనం కొంత బలహీనంగా ఉందన్న విమర్శలు వచ్చాయి.

అంతేకాదు, తక్కువ కమర్షియల్ అపీల్ ఉన్న కథకు హై బడ్జెట్ ఖర్చు చేయడం సినిమా లాభాలను ప్రభావితం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో, తన తదుపరి ప్రాజెక్ట్ కోసం బాబీని నిర్మాతలు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

స్క్రిప్ట్ లెవల్ నుంచే ఖర్చు నియంత్రణ పై దృష్టి సారిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. .  ఆయన తనదైన స్టైల్‌లో కథను సిద్ధం చేసుకుంటూ, బడ్జెట్ పరంగా పకడ్బందీగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈసారి అద్భుతమైన హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి రాగలరా? అనేది ఆసక్తికరంగా మారింది!
 

Surya Prakash
About the Author
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories