Bigg Boss Telugu 7: అందుకే శృంగార చిత్రాలు చేశాను, ఫ్యామిలీ మెంబర్స్ డబ్బుల కోసం... హౌస్లో షకీలా కామెంట్స్!
బిగ్ బాస్ హౌస్లో ఉన్న షకీలా తాను అడల్ట్ కంటెంట్ చిత్రాలు చేయడంపై స్పందించారు. కంటెస్టెంట్ తేజా ప్రశ్నకు సమాధానంగా కీలక కామెంట్స్ చేశారు.
ఒక దశలో మలయాళ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది షకీలా. శృంగార తారగా తిరుగులేని స్టార్డం అనుభవించింది. ఆమె అడల్ట్ కంటెంట్ చిత్రాలు తెలుగు, తమిళ్ లో కూడా డబ్ అయ్యేవి. 2001లో దాదాపు పాతిక సినిమాలు విడుదల చేసి రికార్డు నెలకొల్పింది.
shakeela actress
షకీలా మూవీ విడుదల ఉంటే మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్స్ తమ చిత్రాలు వాయిదా వేసుకునేవారట. అంతటి డిమాండ్ ఆమె సినిమాలకు ఉండేది. అయితే ఎంత త్వరగా ఎదిగిందో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయ్యారు. వయసు పెరిగేకొద్దీ ఆమె లావై షేప్ అవుట్ అయ్యారు. దాంతో షకీలా అడల్ట్ సినిమాలకు ప్రేక్షకులు కరువయ్యారు .
వందల చిత్రాల్లో నటించిన షకీలా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. అయినవారే ఆమెను మోసం చేశారు. చివరికి పెళ్లి కూడా లేకుండా షకీలా ఒంటరి అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఉన్న షకీలా కీలక విషయాలు వెల్లడించారు. కంటెస్టెంట్ టేస్టీ తేజా అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో ఎందుకు నటించారని షకీలాను అడిగాడు.
సమాధానంగా... కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న గ్లామర్ రోల్స్ చేశాను. తర్వాత అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో నాకు ఆఫర్స్ వచ్చాయి. వచ్చిన అవకాశం కాదనకుండా చేసుకుపోయాను. నిక్కర్లు వేసుకుని గ్లామరస్ డాన్సులు చేస్తే తప్పు లేనప్పుడు అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో నటిస్తే తప్పేంటని షకీలా అన్నారు.
మొత్తం 500 చిత్రాలకు పైగా నటించినట్లు షకీలా చెప్పారు. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? అని తేజా అడగ్గా... డబ్బులు బాగా వచ్చేవి. అందుకే వాళ్లు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు అని సమాధానం చెప్పింది. అయినా నువ్వేంటి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావని షకీలా తేజాతో అనగా... అడగటం ఆపేశాడు.
షకీలా సొమ్ము మొత్తం సోదరి కాజేసిందట. పెళ్లి కాకుండా సింగిల్ గా ఉంటున్న షకీలా ట్రాన్స్జెండర్స్ ని దత్తత తీసుకుని వాళ్ళ బాగోగులు చూసుకుంటుందట. ఇన్ని చిత్రాల్లో నటించిన సీనియర్ నటి ఆర్థిక ఇబ్బందులు పడటం ఊహించని పరిణామం.
ఇక తొలి వారం నామినేషన్స్ లో షకీలా ఉంది. పల్లవి ప్రశాంత్, దామిని, ప్రిన్స్ యావర్, షకీలా, శోభిత శెట్టి, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఫస్ట్ వీక్ కావడంతో ఎలిమినేషన్ లేకపోవచ్చు. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ సీజన్ కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది.