Lasya: ఘనంగా యాంకర్ లాస్య సీమంతం వేడుకలు... హాజరైన బుల్లితెర సెలెబ్రిటీలు!
యాంకర్ లాస్య సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు బుల్లితెర, బిగ్ బాస్ సెలెబ్రిటీలు, సన్నిహితులు హాజరయ్యారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Bigg Boss Lasya
సెప్టెంబర్ నెలలో లాస్య తన సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించారు. ఆమె మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా లాస్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Bigg Boss Lasya
ఇటీవల భర్తతో పాటు లాస్య న్యూ ఇయర్(New Year 2023) వేడుకలు జరుపుకున్నారు. బేబీ బంప్ లో ఫోటో షూట్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. లాస్య-మంజునాథ్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అయ్యాయి. లాస్యకు మొదటి సంతానంగా అబ్బాయి ఉన్నాడు. అతడి పేరు జున్ను.
Bigg Boss Lasya
ఇక లాస్యకు నెలలు నిండగా కుటుంబ సభ్యులు సీమంత వేడుక నిర్వహించారు. లాస్య ఈ వేడుకకు తన మిత్రులను, సన్నిహితులను ఆహ్వానించారు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ ఈ వేడుకలో సందడి చేశారు. లాస్య సీమంత వేడుక వీడియోను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
Bigg Boss Lasya
గీతూ(Geetu)తో పాటు పలువురు బుల్లితెర సెలెబ్రిటీలు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లాస్య సీమంత కార్యక్రమానికి హాజరై ఆమెను ఆశీర్వదించినట్లు సమాచారం. ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య (Lasya) బిగ్ బాస్ షోతో మరింత పాప్యులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు.
Bigg Boss Lasya
హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. ఇక తోటి కంటెస్టెంట్స్ తో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. అయితే ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకడైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 (Bigg boss telugu 4) టైటిల్ అందుకున్నారు.
Bigg Boss Lasya
కానీ లాస్య ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ రేసులో ఉంటుందనుకుంటే లాస్య అంచనాలు అందుకోలేదు.ఇక ఈ షో వేదికగా లాస్య కొన్ని పర్సనల్ విషయాలు వెల్లడించారు.
Bigg Boss Lasya
ప్రేమ, పెళ్లి... దానికి ఎదురైన అడ్డంకుల తెలియజేశారు. లాస్య ప్రేమ వివాహం చేసుకోగా, ఆమె తండ్రి అంగీకరించలేదు. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారు. తమకు ఓ బిడ్డ పుట్టాక పేరెంట్స్ దగ్గరయ్యారని లాస్య చెప్పుకొచ్చింది.