గేమ్ ఛేంజర్ లాస్: దిల్ రాజుని ఆదుకోవటానికి అల్లు అర్జున్ భారీ ఆఫర్?
Allu Arjun : రామ్ చరణ్ తో చేసిన గేమ్ ఛేంజర్ సినిమాతో దిల్ రాజు బాగా నష్టపోయారు. ఈ క్రమంలో దిల్ రాజుతో ఉన్న అనుబంధం, స్నేహం కారణంగా అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Allu Arjun has offered to Dil Raju do a film on a priority basis in telugu
Allu Arjun : పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ దేశంలోని పెద్ద స్టార్స్ లో ఒకరిగా అవతరించారు. అల్లు అర్జున్ లోని అసలు పొటిన్షియల్ ఏమిటనేది ప్రపంచానికి పుష్ప సీరిస్ చెప్పింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో సినిమాలు చేయటానికి తెలుగు,తమిళ, హిందీ నిర్మాతలు అడ్వాన్స్ లు పట్టుకుని క్యూలు కడుతున్నారు.
అలాగే దర్శకులు కథలు పట్టుకుని అల్లు అర్జున్ కు వినిపించటానికి ఆయన ఆఫీస్ చుట్టూ రౌండ్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆచి,తూచి ముందుకు వెళ్తున్నారు.
తనకు వచ్చిన స్టార్డమ్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లటానికి ఏం చేయాలనే విషయమై ఆయన కసరత్తులు చేస్తున్నారు. అయితే అదే సమయంలో తన పరిచయాలకి, స్నేహాలకి కూడా విలువ ఇస్తున్నారు. ఆ క్రమంలోనే అల్లు అర్జున్, దిల్ రాజు కాంబోకు రంగం సిద్దం కాబోతోందని తెలుస్తోంది
Allu Arjun has offered to Dil Raju do a film on a priority basis in telugu
దిల్ రాజు అంటే అల్లు అర్జున్ కెరీర్ లో స్పెషల్. ఎందుకంటే తన తొలి హిట్ ఆర్యని ఇచ్చింది దిల్ రాజు మాత్రమే. ఆ తర్వాత పరుగు, దువ్వాడ జగన్నాథం చిత్రాలు దిల్ రాజు, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చాయి.
అయితే ఇప్పుడు దిల్ రాజు కాస్త ఫాల్ లో ఉన్నారు. గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రం నిర్మించి దెబ్బ తిన్నారు. అయితే అదే సమయంలో వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆయన్ని ఒడ్డున పడేసింది.
దాంతో అల్లు అర్జున్ ఆయనకు డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అయితే డైరక్టర్, స్క్రిప్టు ఖరారు అవ్వాల్సి ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ కు సరపడే స్క్రిప్టు కోసం దిల్ రాజు వేట మొదలెట్టారట.
Allu Arjun has offered to Dil Raju do a film on a priority basis in telugu
ఇక దిల్ రాజు కు, అల్లు అర్జున్ కు మధ్య సినిమాలను మించిన స్నేహం ఉందని చెప్తారు. ఓ నిర్మాత, నటుడులా కాకుండా ఇద్దరూ కలుస్తూంటారు. అలాగే రీసెంట్ గా పుష్ప 2 వివాదం సమయంలో కూడా దిల్ రాజు ఇనీషియేషన్ తీసుకుని ముఖ్యమంత్రిని కలిసి పరిష్కరించే ప్రయత్నం చేసారు.
ఏదైమైనా తనకు అత్యంత సన్నిహితమైన నిర్మాతలలో ఒకరైన దిల్ రాజుకి సహాయం అల్లు అర్జున్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. రీసెంట్‌గా దిల్ రాజుతో ప్రైవేట్‌గా మాట్లాడిన బన్నీ కథ నచ్చితే చేసేద్దాం అని చెప్పారట. దిల్ రాజుకు ఇప్పుడు సరైన దర్శకుడు, కథ దొరికితే, 2027లో బన్నీతో సినిమా పట్టాలు ఎక్కచ్చు.