పవర్ లిఫ్టర్‌గా మారిన నటి ప్రగతి.. కఠిన వ్యాయామాలు చేస్తూ చెమటలు పట్టిస్తున్న సీనియర్ నటి.. వామ్మో ఇదేం రచ్చ
సీనియర్ నటి ప్రగతి.. నటిగా అలరిస్తూనే వ్యాయామాలతో ఆకట్టుకుంటుంది. ఆమె జిమ్‌లో శ్రమిస్తూ గతంలో అలరించింది. హార్డ్ వర్కౌట్స్ చేస్తూ తన కండలు చూపించింది. కానీ ఇప్పుడు పెద్ద షాకిచ్చింది.
నటి ప్రగతి.. తెలుగు ఆడియెన్స్ కి బాగా సుపరిచితం. హీరోలు, హీరోయిన్లకి తల్లిగా, అత్తగా నటిస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన నటన, కామెడీతో నవ్వులు పూయిస్తుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్న ప్రగతి ఇప్పుడు పెద్ద షాకిచ్చింది. ఆమె సరికొత్త లుక్‌లోకి మారిపోయింది. అంతేకాదు కొత్త రంగాన్ని ఎంచుకుంది.
ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ వీడియోని పంచుకుంది. ఇందులో ప్రగతి షాకింగ్ లుక్‌లోకి మారిపోయింది. వెయిట్ లిఫ్టర్ డ్రెస్ ధరించింది. వర్కౌట్స్ చేస్తుంది. జుట్టుని స్టయిల్‌గా రింగు రింగులు చేసుకుని కనిపించింది.
బ్లాక్ టీషర్ట్, షార్ట్ ధరించింది. తన థండర్‌థైస్ తో అదరగొడుతూనే తన లక్ష్యంపై ఫోకస్ పెట్టి సీరియస్ గా పవర్ లిఫ్టింగ్‌లో ప్రాక్టీస్ చేస్తుంది. ముందస్తుగా వామప్‌లతో అదరగొడుతుంది. హాట్ అండ్ హార్డ్ వర్కౌట్ చేస్తూ చెమటోడుస్తుంది. వ్యాయామాల తర్వాత ఆమె వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇందులో కఠినంగా ఆమె ప్రాక్టీస్ చేయడం విశేషం.
సాధారణంగా నటీమణులంటే ఎంతో సుకుమారంగా ఉంటారు. సెన్సిటివ్‌గానూ ఉంటారు. కానీ ప్రగతి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తనని తాను నిరూపించుకునేందుకు శ్రమిస్తుంది. పవర్ లిఫ్టింగ్ పోటీల కోసం సన్నద్దమవుతుంది. అందుకోసం జిమ్ లో చెమటోడుస్తూ, తన హాట్ లుక్‌లో నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది.
ఈ సందర్భంగా ఓ సందేశాన్ని ఇచ్చింది ప్రగతి. కొత్త ఆరంభాలంటూ రెండు నెలలుగా దీనిపై శ్రమిస్తున్నట్టు చెప్పింది. రెండు నెలల క్రితం జీవితం పూర్తిగా భిన్నమైన దారిలో పడుతుందని ఎప్పుడూ ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్ లోకి నా కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఈ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
రెండు నెలలు, జీవిత కాలం గడిచిపోయినట్టుగా ఉంది. మనం కూడా దీన్ని సాధిస్తామనిపించింది. 250స్కోర్‌తో ప్రారంభించి, లక్ష్యాలు ఎక్కువగా ఉన్నాయి, నేను ఈ లక్ష్యాలను చేరుకునే వరకు విశ్రమించేది లేదు అని స్పష్టం చేసింది ప్రగతి. తాను `విజన్ డిసిప్లైన్ పవర్ నేషనల్ 2023` పోటీల్లో తాను పాల్గొంటున్నట్టు చెప్పింది ప్రగతి.
ప్రస్తుతం దీనిపైనే ఫోకస్ పెట్టినట్టు తెలిపింది ప్రగతి. పూర్తిగా దానికే టైమ్ కేటాయిస్తుంది. ఈ లెక్కన సినిమాలకు గ్యాపిచ్చిందని చెప్పొచ్చు. మరి పూర్తిగా సినిమాలు మానేసి అటుగా వెళ్తుందా? లేక పోటీలకే పరిమితం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ప్రగతిని ఇలా చూసి అభిమానులు,నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సర్‌ప్రైజింగ్గా ఉందని, నమ్మలేకపోతున్నామని, చాలా గర్వంగా ఉందంటున్నారు. ప్రగతి అన్ స్టాపబుల్ అని చెబుతున్నారు. ఇలానే ముందుకు సాగాలని, ఇన్ స్పైర్ చేయాలని అంటున్నారు.
గతంలో ప్రగతి రెగ్యూలర్‌గా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ని చాటుకునేది. వీక్లీ ఒక్కసారైనా ఆమె తన వర్కౌట్స్ వీడియోలు పంచుకునేది. అది అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకునేది. వాళ్లు కొంటె కామెంట్లతో రచ్చే చేసేవాళ్లు. అలా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది ప్రగతి. కానీ ఇలాంటిది మాత్రం ఎవరూ ఊహించలేదు. ఐదు పదుల వయసులో ఇలాంటి అసాధారణమైన పని చేస్తూ ఆశ్చర్యపరుస్తుందీ సీనియర్ భామ.
సినిమాల పరంగా చూస్తే, ఇటీవల కాలంఓ `డీజేటిల్లు`, `ఎఫ్3`, `రంగ రంగ వైభవంగా`, `గాడ్ ఫాదర్`, `స్వాతిముత్యం` చిత్రాల్లో నటించింది. ఇప్పుడు చిరంజీవి `భోళాశంకర్`తో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అలాగే తమిళంలో ఓ సినిమా చేస్తుంది ప్రగతి.