650 మందితో సెక్స్ చేశా! వారానికి 6 సార్లు ఆరుగురు అమ్మాయిలతో... విండీస్ మాజీ క్రికెటర్ ఆటోబయోగ్రఫీలో..
జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో వెస్టిండీస్ క్రికెటర్లకు తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదేమో. డ్యాన్సులు, పార్టీలు, మందు, పొందు... అన్నింటినీ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు విండీస్ ప్లేయర్లు. క్రిస్ గేల్ శృంగార కార్యకల్లాపాల గురించి ఎన్నో కథలు వినిపించాయి..
బోటుల్లో, హోటల్ గదుల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న క్రిస్ గేల్ ఫోటోలు, సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేశాయి. సీఎస్‌కే ప్లేయర్ డ్వేన్ బ్రావోకి ముగ్గురు భారలు. ఒక్కో సీజన్‌కి ఒక్కో భార్యను తీసుకొస్తున్నాడు బ్రావో..
అయితే సెక్స్ విషయంలో వీళ్లందరికంటే ముందున్నాడు వెస్టిండీస్ మాజీ పేసర్ టినో బెస్ట్. క్రిస్ గేల్, డీజే బ్రావో, కిరన్ పోలార్డ్ వంటి విండీస్ ప్లేయర్లతో కలిసి ఆడిన టినో బెస్ట్, ‘మైండ్ ద విండోస్: మై స్టోరీ’ పేరుతో ఆటోబయోగ్రఫీని రాశాడు..
ఈ పుస్తకంలో తాను ఇప్పటిదాకా 650 మంది యువతులతో సెక్స్ చేసినట్టు పేర్కొన్నాడు టినో బెస్ట్. అంతేకాదు, టినో బెస్ట్ తనని తాను ‘బ్లాక్ బ్రాడ్ ఫిట్’గా పిలుచుకునేవాడట. కరేబియన్ దీవుల్లో తనకంటే అందగాడు లేడని రాసుకొచ్చాడు టినో బెస్ట్..
‘నాకు అమ్మాయిలంటే పిచ్చి. వాళ్లకు నేనంటే కూడా అంతే పిచ్చి. ప్రపంచంలో అత్యంత అందమైన గుండోడిని నేను అనుకుంటా. నన్ను సరదగా బ్లాక్ బ్రాడ్ ఫిట్ అంటుంటా... ’ అంటూ రాసుకొచ్చాడు టినో బెస్ట్..
‘సెక్స్ అంటే నాకు మహా ఇష్టం. నేను చూసిన వాళ్లలో ఎవరితో సెక్స్ చేయాలో ఎంచుకుంటాను. వారంలో ఐదు లేదా ఆరు రోజులు కొత్త కొత్త అమ్మాయిలతో డేటింగ్‌కి వెళ్లేవాడిని. ఒక్కసారి డేట్‌కి వెళ్లిన అమ్మాయితో మళ్లీ డేట్‌కి వెళ్లడం నాకు నచ్చదు..
నేను అందరితో సెక్స్ చేశా. వాళ్లతో కలిసి బెడ్‌రూమ్‌లో సుఖాన్ని తనివితీరా అనుభవించా. యవ్వనం ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. ఈ లైఫ్ స్టైల్ నాకెంతో నచ్చింది....
నాకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా దేశాల్లో కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. 2005 ఆస్ట్రేలియా పర్యటనలో 40 మందితో సెక్స్ చేశా. అప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఆ టూర్‌లో నేను ఒక్క టెస్టు కూడా ఆడలేదు..
కోచ్ బెన్నెట్ కింగ్, నేను రిజర్వు బెంచ్‌లోనే ఉండేవాడిని. ఇక చేసేదేం లేక బయటికి వెళ్లి నచ్చిన అమ్మాయిలను తీసుకొచ్చి నా హోటల్‌లో ఎంజాయ్ చేసేవాడిని. హోటల్ గదికి ఇద్దరు అమ్మాయిలను తీసుకొస్తే ఆ ఇద్దరితోనూ సెక్స్ చేసేవాడిని..
ఆ తర్వాతి రోజు మళ్లీ ఫ్రెష్‌గా ఉండేవాడిని. ఎంత సెక్స్ చేసినా ఆటకి కావాల్సినంత ఫిట్‌గా ఉండేవాడిని. ఎప్పుడూ నా సుఖాలు, సంతోషం నా ఆటకు ఆటంకం కలిగించలేదు.. ’ అంటూ రాసుకొచ్చాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ టినో బెస్ట్..