MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL: వాటే మ్యాచ్.. ఐపీఎల్ హిస్ట‌రీలో పంజాబ్ కింగ్స్ స‌రికొత్త రికార్డు

IPL: వాటే మ్యాచ్.. ఐపీఎల్ హిస్ట‌రీలో పంజాబ్ కింగ్స్ స‌రికొత్త రికార్డు

PBKS vs KKR: ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ లో కేవ‌లం 111 పరుగులను డిఫెండింగ్ చేసుకున్న తొలి టీమ్ గా పంజాబ్ రికార్డు సాధించింది. అంతకుముందు లో స్కోర్ ను డిఫెండింగ్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ రికార్డును బద్దలు కొట్టింది. యుజ్వేంద్ర చాహల్ ఈ గెలుపులో హీరోగా నిలిచాడు.  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 16 2025, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

PBKS vs KKR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో పంజాబ్ టీమ్ చ‌రిత్ర సృష్టించింది. ఎవ‌రూ ఊహించ‌ని మ‌లుపుల‌తో విజ‌యాన్ని అందుకుని కొత్త రికార్డు సాధించింది. అత్య‌ధిక ప‌రుగుల  టార్గెట్ ను అందుకోవ‌డంతో పాటు అత్య‌ల్ప ప‌రుగుల‌ను డిఫెండింగ్ చేసుకున్న తొలి టీమ్ గా రికార్డుల‌కెక్కింది. 

ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్-కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ల్ప స్కోర్ ను డిఫెండింగ్ చేసుకోవడంలో స‌క్సెస్ అయి చ‌రిత్ర సృష్టించింది శ్రేయాస్ అయ్య‌ర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ టీమ్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Punjab Kings' Yuzvendra Chahal and teammates celebrate the dismissal of Sunrisers Hyderabad's Travis Head

Punjab Kings' Yuzvendra Chahal and teammates celebrate the dismissal of Sunrisers Hyderabad's Travis Head

IPL 2025లో అభిమానులకు ఇప్ప‌టివ‌ర‌కు ఫోర్లు, సిక్సర్ల ఉత్సాహాన్ని చూశారు. కానీ, పంజాబ్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన low స్కోరింగ్ మ్యాచ్‌లో వికెట్లు ప‌డుతుంటే ట్రిపుల్ డోస్ ఉత్సాహం కనిపించింది. ఓడిపోవ‌డం ప‌క్కా అనుకున్న త‌క్కువ టోట‌ల్ ను ఢిఫెండ్ చేసుకుని పంజాబ్ కింగ్స్ 16 ప‌రుగుల తేడాతో మ్యాచ్ ను గెలుచుకుంది. ఈ విజయంతో పంజాబ్ జట్టు చరిత్ర సృష్టించింది. 

36
IPL 2025: Punjab Kings vs Kolkata Knight Riders

IPL 2025: Punjab Kings vs Kolkata Knight Riders

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌పై ఆకలితో ఉన్న సింహాల మాదిరిగా కేకేఆర్ బౌలర్లు విరుచుకుప‌డ్డారు. దీంతో పంజాబ్ టీమ్ కేవ‌లం 111 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భు సిమ్రాన్ సింగ్ 30, ప్రియాంశ్ ఆర్య 22, శ‌శాంక్ సింగ్ 18 ప‌రుగుల ఇన్నింగ్స్ ల‌ను ఆడారు.

కేకేఆర్ బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా మూడు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. కేకేఆర్ సూప‌ర్ బౌలింగ్ దెబ్బ‌కు పంజాబ్ టీమ్ వ‌రుస వికెట్లు స‌మ‌ర్పించుకుంది. 15.3 ఓవ‌ర్ల‌లో 111 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, ఈ ఆనందం కేకేఆర్ కు ఎక్కువ సేపు ఉండ‌లేదు. బ్యాటింగ్ స‌మ‌యంలో ట్ర‌బుల్ లో ప‌డింది. 

46

పంజాబ్ కింగ్స్ కేవ‌లం 111 ప‌రుగులు చేయ‌డంతో ఇంకేముందు కేకేఆర్ గెలుస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఐపీఎల్ లో అత్య‌ధిక స్కోర్ తో పాటు అత్య‌ల్ప స్కోర్ల‌ను కూడా డిఫెండింగ్ చేసుకున్న చ‌రిత్ర క‌లిగిన పంజాబ్ మ‌రోసారి అద్భుతం చేసింది. 

సూప‌ర్ ఫామ్ లో ఉన్న కోల్‌కతా బ్యాట‌ర్ల‌ను అద్భుత‌మైన బౌలింగ్ తో పంజాబ్ దెబ్బ‌కొట్టింది. సునీల్ నరైన్, క్వింట‌న్ డి కాక్ సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు. అంగ్క్రిష్ రఘువంశీ 37 పరుగుల ఇన్నింగ్స్ మ్యాచ్‌కు ప్రాణం పోసింది. రహానె కూడా 17 పరుగులు చేశాడు. కానీ ఈ ఇద్దరి వికెట్లు ప‌డిన త‌ర్వాత‌ పంజాబ్ టీమ్ తిరిగి మ్యాచ్ ను త‌న‌వైపు లాక్కుంది. వ‌రుస ఓవ‌ర్ల‌లో వికెట్లు తీసుకుని కేకేఆర్ ను 95 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీసి మ్యాచ్ ను మార్చిప‌డేశాడు. పంజాబ్ కింగ్స్ టీమ్ లో  కింగ్ గా మారాడు. 

56

చ‌రిత్ర సృష్టించిన పంజాబ్

కేకేఆర్ పై గెలుపుతో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. గత మ్యాచ్‌లో పంజాబ్ హైదరాబాద్  చేతిలో భారీ స్కోర్ చేసి ఓడిపోయింది. కానీ, ఇప్పుడు అయ్య‌ర్ టీమ్ ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్య‌ల్ప స్కోర్ ను డిఫెండింగ్ చేసుకుంది. అంత‌కుముందు, 2009 లో కూడా పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ డిఫెండ్ చేసుకున్న 116 పరుగుల రికార్డును బ్రేక్ చేసింది.

 

66

అలాగే, అత్య‌ధిక ప‌రుగుల ర‌న్ చేజ్ కూడా పంజాబ్ జ‌ట్టు పేరిటే ఉంది. ఏప్రిల్ 26, 2024న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల చేజ్ రికార్డు న‌మోదైంది. ఈ పోరులో తొలి ఇన్నింగ్స్‌లో ఫిల్ సాల్ట్ 37 బంతుల్లో 75 ప‌రుగులు, సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 ప‌రుగుల‌తో సునామీ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో కేకేఆర్ 261 ప‌రుగులు చేసింది.

భారీ టార్గెట్ తో సెంకండ్ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు జానీ బెయిర్‌స్టో కేవలం 48 బంతుల్లో 108 పరుగుల సునామీ నాక్ తో పాటు శశాంక్ సింగ్ 28 బంతుల్లో 68 పరుగులు ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌టంతో పంజాబ్ జట్టు 18.4 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుని చ‌రిత్ర  సృష్టించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image2
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్
Recommended image3
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved