MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • MI vs LSG: వాటే థ్రిల్లింగ్ మ్యాచ్.. చివ‌రి ఓవ‌ర్ లో సూప‌ర్ విక్ట‌రీ కొట్టిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్

MI vs LSG: వాటే థ్రిల్లింగ్ మ్యాచ్.. చివ‌రి ఓవ‌ర్ లో సూప‌ర్ విక్ట‌రీ కొట్టిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్

IPL 2025 MI vs LSG: ఐపీఎల్ 2025లో బ్యాటింగ్, బౌలింగ్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ముంబై ఇండియ‌న్స్ పై 12 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 
 

Mahesh Rajamoni | Published : Apr 04 2025, 11:46 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
IPL MI vs LSG: What a thrilling match.. Lucknow Super Giants scored a super victory in the last over

IPL MI vs LSG: What a thrilling match.. Lucknow Super Giants scored a super victory in the last over

IPL MI vs LSG: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 16వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి. చివ‌రి ఓవ‌ర్ వర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్ లో ల‌క్నో టీమ్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో టీమ్ 203/8 ప‌రుగులు చేసింది. భారీ టార్గెట్ బ్యాటింగ్ మొద‌లుపెట్టిన ముంబై ఇండియ‌న్స్ 191/5 ప‌రుగులు చేసింది. 

25
Image Credit: Twitter/LSG

Image Credit: Twitter/LSG

లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో రెండు టీమ్ లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.

దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మిచెల్ మార్ష్ (60 పరుగులు), ఐడెన్ మార్క్రమ్ (53 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ ముందు 204 పరుగులు భారీ టార్గెట్ ను ఉంచింది.  ఆయుష్ బదోని 30 పరుగులు, డేవిడ్ మిల్లర్ 27 పరుగుల ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు.

35
MI vs LSG

MI vs LSG

204 ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొద‌లుపెట్టిన ముంబై ఇండియ‌న్స్ చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు గెలుపు కోసం పోరాడింది. అయితే, శార్ధుల్ ఠాగూర్ 19 ఓవ‌ర్ లో  సూప‌ర్ బౌలింగ్ వేసి ముంబైని దెబ్బ‌కొట్టాడు. చివ‌రి ఓవ‌ర్ లో ముంబై విజ‌యానికి 22 ప‌రుగులు అవ‌స‌రం కాగా, 9 ప‌రుగులే వ‌చ్చాయి. హార్దిక్ పాండ్యా చివ‌రి ఓవ‌ర్ లో స్ట్రైక్ లో ఉన్న‌ప్ప‌టికీ త‌న జ‌ట్టుకు విజయాన్ని అందించ‌లేక‌పోయాడు. 

45
MI vs LSG

MI vs LSG

ముంబై ఇండియ‌న్స్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ త‌గిలింది. 17 ప‌రుగుల‌కే ఇద్ద‌రు ఓపెన‌ర్ల‌ను కోల్పోయింది. అయితే, న‌మ‌న్ ధీర్, సూర్యకుమార్ యాద‌వ్ లు సూప‌ర్ నాక్ ల‌తో మళ్లీ ముంబై ఇండియ‌న్స్ ను తిరిగి గేమ్ లోకి తీసుకువ‌చ్చారు. అయితే, కీల‌క స‌మ‌యంలో సూర్య కుమార్ వికెట్ ప‌డ‌టం, తిల‌క్ వ‌ర్మ మెర‌వ‌క‌పోవ‌డంతో ముంబై క‌ష్టాల్లో ప‌డింది. తిల‌క్ వ‌ర్మ 25, హార్దిక్ పాండ్యా 28 ప‌రుగుల ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. 20 ఓవ‌ర్ల‌లో ముంబై ఇండియ‌న్స్ 5 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగులు చేసింది.

55
Image Credit: Twitter/Mumbai Indians

Image Credit: Twitter/Mumbai Indians

ల‌క్నో బౌల‌ర్లు కీల‌క స‌మ‌యంలో సూప‌ర్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టారు. మ‌రీ ముఖ్యంగా శార్ధుల్ వేసిన 19 ఓవ‌ర్ ల‌క్నో మ్యాచ్ విన్నింగ్ ట‌ర్నింగ్ పాయింట్ గా నిలిచింది. చివ‌రి ఓవ‌ర్ కూడా అవేష్ ఖాన్ అద్భుతంగా వేశాడు. వీరికి తోడుగా ఎక్కువ ప‌రుగులు ఇవ్వ‌కుండా దిగ్వేష్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. దీంతో ల‌క్నో టీమ్ 12 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 
Recommended Stories
Top Stories