- Home
- Sports
- Cricket
- IND vs NZ Head To Head: భారత్ ను అడ్డుకోవడం న్యూజిలాండ్ కు కష్టమే.. రెండు జట్ల రికార్డులు ఇవే
IND vs NZ Head To Head: భారత్ ను అడ్డుకోవడం న్యూజిలాండ్ కు కష్టమే.. రెండు జట్ల రికార్డులు ఇవే
India vs New Zealand Head To Head Records: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. కీలకమైన సెమీస్ పోరుకు ముందు న్యూజిలాండ్ తో తన చివరి గ్రూప్ మ్యాచ్ ను ఆడనుంది. అయితే, ఇరు జట్ల గెలుపు రికార్డులు ఏంటి?

India vs New Zealand Head To Head Records: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లను గెలుచుకోవడంతో భారత్, న్యూజిలాండ్ లు ఇప్పటికే సెమీ-ఫైనల్స్ లో తమ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి.
దీంతో రాబోయే మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయినా టోర్నీలో కొనసాగే విషయంలో పెద్దగా ఏమీ జరగదు కానీ, కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఓటమి అంటే జట్టు ఒత్తిడిలోకి జారుకునే అవకాశముంది. దీంతో న్యూజిలాండ్-భారత్ లు ఎలాగైనా తమ తర్వాతి మ్యాచ్ ను గెలుచుకోని మరింత జోష్ తో సెమీ ఫైనల్ పోరుకు వెళ్లాలని భావిస్తున్నాయి.
team India, cricket, IND
భారత్ హ్యాట్రిక్ కోడుతుందా? న్యూజిలాండ్ బ్రేకులు వేస్తుందా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ అద్భుతంగా తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. తన తర్వాతి మ్యాచ్ లో కీవీస్ పై గెలిచి హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. మరోవైపు, న్యూజిలాండ్ కూడా తన మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుచేసింది. ఆ తర్వాతి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించింది. ఇప్పుడు మూడో మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కూడా భారత్ విజయం పక్కా అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇరు జట్ల రికార్డులు గమనిస్తే భారత్ జోరును న్యూజిలాండ్ ఆపడం కష్టమనే చెప్పాలి. రెండు జట్ల మధ్య జరిగే వన్డేల్లో హెడ్ టు హెడ్ గణాంకాలను పరిశీలిస్తే భారత్ దే పైచేయిగా ఉంది.
IND Vs NZ వన్డేల్లో గణాంకాలు ఎలా ఉన్నాయి?
ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 118 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. భారత జట్టు 60 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కివీస్ జట్టు 50 మ్యాచ్‌ల్లో గెలవగలిగింది. ఇప్పటివరకు, రెండు జట్ల మధ్య జరిగిన ఒక వన్డే టై మాత్రమే టై కాగా, మరో 7 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై భారత జట్టు పైచేయి సాధించిందని గణాంకాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఈ రికార్డులతో పాటు ప్రస్తుతం భారత జట్టు ఫామ్ ను ప్రత్యర్థి జట్లకు ఆపడం కష్టమని క్రికెట్ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. భారత జట్టులో చాలా మంది బ్యాట్స్‌మెన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.
IND Vs NZ ఆడిన మొత్తం మ్యాచ్‌లు: 118 వన్డేలు
భారతదేశం గెలిచింది: 60 మ్యాచ్‌లు
న్యూజిలాండ్ గెలిచింది: 50 మ్యాచ్‌లు
టై మ్యాచ్‌లు: 1
ఫలితం రాని మ్యాచ్‌లు: 7
Team India (Photo:X/@BCCI)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ vs న్యూజిలాండ్ రికార్డులు ఎలా ఉన్నాయి?
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఈ సమయంలో కివీస్ జట్టు గెలిచింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ (ICC నాకౌట్)లో న్యూజిలాండ్ భారత్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు భారత్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. కానీ, మొత్తంగా వన్డే రికార్డులు గమనిస్తే భారత్ దే పైచేయిగా ఉంది. అదే సమయంలో కీవీస్ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పే బ్యాటర్లు, బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు.
Image Credit: Getty Images
ఇండియా - న్యూజీలాండ్ టెస్టు క్రికెట్ రికార్డులు ఇలా ఉన్నాయి:
మొత్తం ఆడిన టెస్టు మ్యాచ్‌లు: 65
ఇండియా గెలిచిన మ్యాచ్‌లు: 22
న్యూజీలాండ్ గెలిచిన మ్యాచ్‌లు: 16
డ్రా అయిన మ్యాచ్‌లు: 27
ఇండియా - న్యూజిలాండ్ టీ20 క్రికెట్ రికార్డులు ఇలా ఉన్నాయి:
మొత్తం ఆడిన మ్యాచ్‌లు: 25
ఇండియా గెలిచిన మ్యాచ్‌లు: 14
న్యూజీలాండ్ గెలిచిన మ్యాచ్ లు: 10 (1 ఫలితం రాలేదు)