యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు జాన్ మెకాఫీ జీవిత చరిత్ర, జైలు జీవితం, బయోగ్రఫీ
యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు, వ్యాపార వేత్త, పుస్తక రచయిత జాన్ మెకాఫీ బార్సిలోనా జైలులో కొద్దిరోజుల క్రితం మరణించిన సింగతి మీకు తెలిసిందే. పన్ను ఎగవేత కేసుల్లో ఆయనను అమెరికాకు అప్పగించడానికి అనుమతిస్తూ స్పెయిన్ కోర్టు ఉత్తర్వు లిచ్చిన కాసేపటికే జాన్ మెకాఫీ జీవితం జైలులోనే ముగిసింది.
కాటలాన్ జస్టిస్ డిపార్ట్మెంట్ జైలు వైద్యులు జాన్ మెకాఫీ కాపాడటానికి ఎంతో ప్రయత్నించారు అని తెలిపింది. బ్రిటిష్-అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, వ్యాపారవేత్త జాన్ మెకాఫీ 75 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. జాన్ మెకాఫీ 18 సెప్టెంబర్ 1945న ఇంగ్లాండులో జన్మించాడు. తన చిన్నతనంలోనే వర్జీనియాకి వలస వచ్చాడు.
కంప్యూటర్ ప్రపంచంలో మల్టీ-బిలియన్ డాలర్ల పరిశ్రమను స్థాపించడానికి మెకాఫీ వైరస్ స్కాన్ సహాయం ఉపయోగపడింది.చివరికి టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్కు 6 7.6బిలియన్ల డాలర్లకు విక్రయించారు.
గత ఏడాది అక్టోబరులో బార్సిలోనా అంతర్జాతీయ విమానాశ్రయంలో మకాఫీని అరెస్టు చేశారు, అప్పటి నుండి జైలులో ఉన్నారు.అయితే అతనిపై నాలుగేళ్లుగా పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి రెండుసార్లు నిమినిగా చేయాలనుకున్నారు.
జాన్ మెకాఫీ ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ నుండి ఈ స్థాయికి రావడం అనేది ఒక చరిత్ర. ఆయన చేసిన ప్రతీదీ ఓ వార్తే. క్రిప్టో కరెన్సీని సమర్థించారు. పన్నులు చెల్లింపులను ధిక్కరించారు. డ్రగ్స్ తీసుకున్నారు. తుపాకీ చేతపట్టారు. వనితలతో కలసి విహరించారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు. వివాదాలతో వీధికెక్కారు. చివరకు ఆత్మహత్యతో ఆయన మరణమూ సంచలన వార్తయింది.
8 ఏళ్లుగా ఎదురుకొంటున్న ఆదాయపు పన్ను ఆరోపణలపై 2019లో ఆయనే స్వయంగా వివరించారు. అప్పటి నుంచి అమెరికా న్యాయ విచారణను తప్పించుకోవడం కోసం ఓ విలాసవంతమైన నౌకలో కాలక్షేపం చేశారు. భార్య, నాలుగు కుక్కలు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఏడుగురు సిబ్బంది ఇదే ఆయన ప్రపంచం. ఏడు పదులు దాటిన వయసులో పదిహేడేళ్ళ అమ్మాయితో కలసి, ఇంటి నిండా ఆయుధాలతో పోలీసుల కంటపడి పారిపోయారు.
1987లో ప్రపంచంలో తొలి కమర్షియల్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను మెకాఫే ప్రారంభించారు. పదేళ్ళ క్రితమే తన సంస్థను ‘ఇన్‌టెల్’కు అమ్మేసినా ఆ సాఫ్ట్‌వేర్ మాత్రం ఇప్పటికీ మెకాఫే పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది. ఒకప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సహా జిరాక్స్ లాంటి సంస్థల్లో పనిచేశారు కూడా. ‘క్రిప్టోకరెన్సీ గురు’గా మారిన ఆయన రోజుకు వేల డాలర్లు సంపాదించారు. చివరకి జైలులోనే జీవితం ముగించారు.
మెకాఫేకు ట్విట్టర్‌లో ఏకంగా 10 లక్షలమంది ఫాలోయర్లున్నారు. దాన్నిబట్టి ఆయన పాపులరిటీ అర్థం చేసుకోవచ్చు. మెకాఫే రియల్ ఎస్టేట్ మొదలు హెర్బల్ యాంటీ బయాటిక్స్, బిట్‌కాయిన్ మైనింగ్ ఇలా ఎన్నో వ్యాపారాల్లో ఆయన ఉన్నారు. 2007 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఎంతో పోగొట్టుకున్నారు. మెకాఫే పై ‘గ్రింగో: ది డేంజరస్ లైఫ్ ఆఫ్ జాన్ మెకాఫే’ అంటూ అయిదేళ్ళ క్రితం ఓ డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది.