MS Dhoni Cars Collection: ధోనీ వాడే ఫెరారీ కారు 3 సెకన్లలో ఎంత స్పీడ్ వెళుతుందో ఎంతో తెలిస్తే షాక్ తింటారు..
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇప్పటికే ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. రిటైర్ మెంట్ ప్రకటించిన ప్పటికీ క్రికెట్‌లో భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కూడా ధోనీ నిలిచాడు. T20 ప్రపంచ కప్, వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రధాన ICC టోర్నమెంట్లలో భారత జట్టును విజేతగా నిలిపాడు.
ఇక, ధోనీ వ్యక్తిగత జీవితానికి వస్తే డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ధోనీ దగ్గర ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ బైక్స్, కార్ల కలెక్షన్ ఉంది. వాటిని ఆయన తన గ్యారేజీలో పార్క్ చేస్తారు. 2009లో, అతను దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు చేసి హమ్మర్ హెచ్2ని కొనుగోలు చేశాడు.
హమ్మర్ హెచ్2 కాకుండా ధోని గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇది ఆడి క్యూ7, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, జిఎంసి సియెర్రా, ఫెరారీ 599 జిటిఓ, మిత్సుబిషి అవుట్‌ల్యాండర్, పజెరో ఎస్‌ఎఫ్‌ఎక్స్, టయోటా కరోలా, పోర్స్చే 718 బాక్స్‌స్టర్, కస్టమ్ బిల్ట్ స్కార్పియో (ఓపెన్), జీప్ గ్రాండ్ చెరోకీ, నిస్సాన్ జోన్రా వంటి అనేక కార్లు ఉన్నాయి.
వీటన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, ఫెరారీ 599 GTO గురించే ఈ కారు కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో, ఈ కారులో ఒక గంటకు 335 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ధోని తన కార్ల ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తుంటాడు.
ధోని వద్ద ఇలాంటి కార్లు డజనుకు పైగా ఉన్నాయి. వాటి విలువ రూ.7 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఉదాహరణకు, అతని ఫెరారీ 599 GTO ధర రూ. 3.57 కోట్లు. దీనితో పాటు ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ ధర రూ. 44.41 లక్షలు, ఆడి క్యూ7 ధర రూ. 88.33 లక్షలు, జీప్ గ్రాండ్ చెరోకీ ధర రూ. 75.15 లక్షలు, నిస్సాన్ జోంగా ధర రూ. 10.5 లక్షలు, జిఎంసి సియెర్రా ధర రూ. 53 లక్షలు.
ఇక ధోని బైక్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే, అతని వద్ద చాలా లగ్జరీ బైక్‌లు ఉన్నాయి. పాత యమహా మోడల్ నుండి అనేక లగ్జరీ బైక్‌లు ఉన్నాయి. Confederate X132 Hellcat, Kawasaki Ninja, Harley Davidson, Royal Enfield, Ducati 1098, TVS Apache వంటి బైక్‌లు అతని గ్యారేజీలో పార్క్ చేసి ఉంటాయి. అతని వద్ద 10 కంటే ఎక్కువ లగ్జరీ బైక్‌లు ఉన్నాయి.