MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Andhra Pradesh
  • గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంత ఏపీలో వానలు... ఎందుకిలా జరిగింది? ఎంత నష్టం వాటిల్లింది?

గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంత ఏపీలో వానలు... ఎందుకిలా జరిగింది? ఎంత నష్టం వాటిల్లింది?

గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏపీలో వర్షాలు పడ్డాయి. దీంతో వాగులు, వంకలు ఏకమై పొంగి పొర్లాయి. పల్లెలు, పట్టణాలు జల దిగ్బంధంలోకి వెళ్లాయి. అసలు ఎందుకిలా జరిగింది...?

Galam Venkata Rao | Updated : Sep 02 2024, 02:31 AM
6 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు జనజీవనానికి తీవ్ర ఆటంకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వానలు, వరదలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీగా వరద నీరు పట్టణాలు, పల్లెల్లోకి చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. బుడమేరు వరద ఉధృతితో విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది.

27
Heavy rains in Andhra Pradesh and Disruption of trains

Heavy rains in Andhra Pradesh and Disruption of trains

భారీ వర్షాలు, వరదలకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, రాయనపాడులో రైలుపట్టాలపై వరదతో, ట్రాక్‌పైనే రైళ్లు నిలిచి పోయాయి. భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

37
Chandrababu in relief operations in Vijayawada

Chandrababu in relief operations in Vijayawada

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ప్రభావం, వాతావరణ పరిస్థితులపై హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలోని ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా తుఫాను ప్రభావం, వర్షపాతం నమోదు అంశాలు సీఎంకు సీఎస్ వివరించారు.

వరద ఉధృతి ఎక్కడెక్కడ ఉందన్నదానిపై సీఎం ఆరా తీశారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న అనంతరం తాజా వర్షాలు ఓ పాఠంగా అధికారులు అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కబాధితుడికి సాయం అందించాలన్నారు.

తుఫాను తీరం దాటినచోట కంటే ఇతర చోట్ల ఎక్కువ వర్షాలు జలాశయాలన్నీ దాదాపు నిండిపోయాయని... ఈ నేపథ్యంలో వాగులు, చెరువులకు నీరు వెళ్లే దారిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

47
Heavy Rains Andhra Pradesh

Heavy Rains Andhra Pradesh

రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల వల్ల మొత్తం అతలాకుతలమైంది. ఎప్పుడూ పడనటువంటి వర్షపాతం ఇక్కడ నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 32.3 సెంటీమీటర్లు అంటే 323 మిల్లీమీటర్లు, జగ్గయ్య పేటలో 20.27 సెం.మీ (261మి.మీలు), తిరువూరులో 26.0 సెం.మీ, గుంటూరులో 26.0 సెం.మీ వర్షపాతం  నమోదయింది. రాష్ట్రంలోని 14 మండలాల్లో సగటున 24 గంటల వ్యవధిలో 20 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం  నమోదు అయింది.

మరోపక్కన 62 ప్రాంతాల్లో 112 సెం.మీ. నుండి 20 సెం.మీ. ల వర్షపాతం నమోదు అయింది. 94 స్టేషన్లలో 14 జిల్లాల్లో 7 నుండి 12 సెం.మీ.ల వర్షపాతం రికార్డు అయింది. 

‘గతంలో హైదరాబాద్‌లో 20 సెం.మీ.ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయినప్పుడు సర్ప్లస్ వైరు బ్రీచ్ చేసి ఎవాక్చువేషన్ వాటర్ చేశాం. దీనివల్ల విజయవాడ, గుంటూరు నగరాలు మెరుగైన పరిస్థితికి వచ్చాయి. గుంటూరు - విజయవాడ, విజయవాడ - హైద్రాబాద్  నేషనల్ హైవేలో కాజ, జగ్గయ్యపేట వద్ద మెరుగైన పరిస్థితి వచ్చింది. ఇది బాధాకరమైన విషయం.

ఒకే చోట ల్యాండ్ స్లైడ్ జరిగి ఐదుగురు చనిపోవడం, ఇంకో చోట ముగ్గురు.. వీరిలో ఇద్దరు వాగులో కొట్టుకుపోవడం, మరోచోట మంగళగిరిలో 80 యేళ్ల వృద్ధురాలు ల్యాండ్ స్లైడ్ బోల్డర్స్ పడి చనిపోవడం దురదృష్టకరం. మొత్తంగా 9 మంది, ఒక మిస్సింగ్ కేసు ఉండటం బాధాకరం. ప్రాణనష్టాన్ని కొంత వరకు తగ్గించాం. ఈ 9 మంది కూడా చనిపోకుండా ఉండి ఉంటే బాగుండేది’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

57
Reservoirs in AP filled up

Reservoirs in AP filled up

‘రిజర్వాయర్స్ అన్నీ నిండుకున్నాయి. ఈ పరిస్థితిల్లో వచ్చిన వాటర్‌ను వచ్చినట్లే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు శ్రీశైలం నుంచి కిందికి వాటర్ ఫుల్‌గా వస్తోంది. అక్కడి నుండి నాగార్జున సాగర్, అక్కడి నుండి పులిచింతల ఫుల్ అయింది. మధ్యలో నల్గొండ, ఖమ్మం జిల్లాల నుండి బుడమేరు, ఇతర వాగుల ద్వారా నీరు వచ్చి చేరింది. దీంతో లక్ష నుండి 2 లక్షల క్యూసెక్కులు లేదా 3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందా? అన్న పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నాం.

దీంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రకాశం బ్యారేజ్ కు 8,90,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిన పరిస్థితి. సోమవారానికి 10 లక్షలు గానీ 10.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం. కొన్నిచోట్ల చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. బుడమేరు దగ్గరకు భారీగా నీరు చేరడంతో వీటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది.

బుడమేరు నుండి నేరుగా కొల్లేరు సరస్సు కు వెళ్లాల్సిన నీరు వెళ్లకుండా  విజయవాడ పైన పడిన పరిస్థితి.. ఇప్పటికే సబ్ మెర్జన్స్ లో ఉంది.

బుడమేరు బ్రీచ్ వల్ల మళ్లీ నీరు వస్తున్న పరిస్థితి.  ఇప్పుడు అక్కడకు వెళ్లి గండి పూడ్చడానికి కూడా వీలులేని పరిస్థితి.  దీనిని పరిష్కరించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం.

ప్రకాశం బ్యారేజ్ కు 10 లక్షలు లేదా 10.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరినప్పుడు కొన్ని వీక్ బండ్స్ ఉన్నాయి.  ఇసుక బస్తాలు పెట్టి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం.  కలెక్టర్లను అప్రమత్తం చేశాం. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం. వీక్ బండ్స్ ను పటిష్టం చేస్తాం.

ఇది మీ ప్రభుత్వం.. అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకున్నాం. వరద ముంపు నుండి జనాలను రక్షించేందుకు తీసుకుంటున్న సహాయక చర్యల్లో  ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

వీలైనంత వరకు ప్రాణ నష్టాన్ని, పశువుల నష్టాన్ని కాపాడగలిగాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

67
Repairs to railway embankments damaged by heavy rains

Repairs to railway embankments damaged by heavy rains

వరదల వల్ల ఆస్తి నష్టం, పంటలు బాగా దెబ్బతిన్న పరిస్థితి. లక్షా 11 వేల 259 హెక్టార్లలో వ్యవసాయ పంటల నష్టం సంభవించింది. హార్టి కల్చర్‌లో 7,360 హెక్టార్ల పంట దెబ్బతింది. పెదకాకాని వద్ద ఒక సమ్మర్ స్టోరేజ్ దెబ్బతింది. అలాగే, పెద్ద ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. 2, 3 రైళ్లు ఆగిపోయాయి. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టారు. 107 క్యాంపులు పెట్టారు. 17 వేల మందిని క్యాంపులకు తరలించారు. పంటలు దెబ్బతిన్న చోట్లకు 8 మోటరైజ్డ్ బోట్లను పంపించారు. రెండు చాపర్లు కూడా పని చేస్తున్నాయి. 

ఓవైపు రిహాబిలిటేషన్ చర్యలు చేపడతూనే పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పరిహారం కూడా పెంచామని.. ప్రతి ఒక్కరికీ 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పప్పు, పంచదార, ఉల్లిపాయలు, పొటాటో, ఆయిల్  ఇస్తామన్నారు. వీవర్స్ కు పనులు ఒకట్రెండు నెలలు ఉండవన్న ఉద్దేశంతో వారికి, మత్స్యకారులకు అదనంగా మరో 25 కేజీల బియ్యం అందిస్తామని తెలిపారు. అలాగే, 5 లక్షల ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేశారు.

77
CM Chandrababu in Flood Relief Operations

CM Chandrababu in Flood Relief Operations

కాగా, ఈ సంవత్సరం భారీగా వర్షాలు పడ్డాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28.5 శాతం అదనంగా వర్షపాతం నమోదైందన్నారు. 3 జిల్లాల్లో 60 శాతం కన్నా ఎక్కువ, 19 జిల్లాల్లో 20- 50 శాతం ఎక్కువ, 4 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. 

‘గత 5 ఏళ్లుగా శ్రద్ధ పెట్టని కారణంగా వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. వాటన్నింటిని క్లియర్ చేస్తాం.. గత 5 ఏళ్లలో బుడమేరు ఛానల్ ను సరిచేయకపోవడం వల్ల దాని పర్యవసానం వీటీపీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. విజయవాడ పట్టణం ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అది సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు చంద్రబాబు. 

‘ప్రకాశం బ్యారేజ్ కు 10 లక్షలు లేదా అంతకు పైగా క్యూసెక్కుల నీరు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలన్నదే మా తక్షణ కర్తవ్యం. అలాగే నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తాం. రైతులను ఆదుకునేందుకు ఏమేం చేయాలో చేస్తాం. మళ్లీ వ్యవసాయాన్ని కాపాడుతాం. పంటను కాపాడటమే కాదు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చి పంటను రివైవ్ చేయడానికి ఏం చేయాలో చేస్తాం.’

‘50 సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది. ప్రజలు కూడా ఎన్నో వరదలు చూశామన్న భావనలో ఉన్నారు కానీ ఒకే ప్రాంతంలో ఇంత ఎక్కువ వర్షపాతం పడటం ఇదే మొదటి సందర్భం. గుంటూరు, విజయవాడలో 37 సెం.మీల వర్షపాతం నమోదవడం అబ్ నార్మల్. ఇదే క్లౌడ్ బ్రస్టింగ్..  నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ ల 50 సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు. అలాంటిది ఓవర్ ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో సబ్ మెర్జన్స్ కు తీసుకెళ్లే పరిస్థితికి వచ్చాయి. బ్రిటీష్ వాళ్లు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ చూస్తే వాళ్లు 100 సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే 25- 50 శాతం యాక్సెస్ కెపాసిటీ పెట్టారు. ఆల్ అవుట్ లెట్స్ చూస్తే  బ్రిటీష్ వారు కట్టిన బ్రిడ్జిలు ఎక్కడా ఓవర్ ప్లో కావడం లేదంటే అంత దూరదృష్టితో కట్టారని అర్థం. 
మనం కూడా కట్టినప్పటికీ ఒక్కోసారి మనం ఊహించని విధంగా  వాతావరణ మార్పుల కారణంగా ఇలా జరుగుతుంటాయి. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.. వాళ్లల్లో కూడా ఒక  వాస్తవం ఉంది.. గవర్నమెంట్ అంటే వీళ్లకు ఏమీ తెలియకుండా మాట్లాడుతారనే ఫీలింగ్ ఉంది.  మేం అన్నీ చూశాం వీళ్లకేం తెలుసని .. మేం కూడా డేటా బేస్ చేసుకొని సైంటిఫిక్ గా అప్రోచ్ అవుతాం. 
ఇప్పటికి కొన్ని తప్పులు జరిగినా భవిష్యత్ లో మాత్రం సిస్టమేటిక్ గా  చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందులో నో సెకండ్ థాట్.. ప్రజలు, పిల్లల భద్రతే మాకు ముఖ్యం. వారి భద్రతకు విఘాతం కల్గించే ప్రయత్నం ఎవరు చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు. చాలా కఠినంగా వ్యవహరిస్తాం.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని’ చంద్రబాబు తెలిపారు. జాగ్రత్తగా ఉండమని ప్రజలందరినీ కోరారు.

‘మంగళవారానికి వర్షాలు తగ్గుతాయని పాఠశాలలకు, కళాశాలలకు సోమవారం హాలిడే డిక్లేర్ చేశాం. శనివారం మధ్యాహ్నం నుంచి వర్షం ఆగింది.. కానీ క్యాచ్ మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాల వల్ల నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం వరకు హాలిడే ప్రకటించాం. ఈ అంశంపై మంగళవారం రివ్యూ చేసుకుందాం’ అని చంద్రబాబు తెలిపారు. 

‘తుంగభద్ర ఘటనలో ఫోన్ చేసి కన్నయ్య నాయుడుని పంపించి నీళ్లు వచ్చే సమయంలోనే గేట్లు పెట్టించే పరిస్థితికి వచ్చాం. అది మా చిత్తశుద్ధి. దానివల్ల తుంగభద్రతకు 95 -96 టీఎంసీల నీళ్లు వచ్చాయి. రేపో, ఎల్లుండో 100 శాతం ఫుల్ అవుతుంది. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Galam Venkata Rao
About the Author
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. Read More...
ఆంధ్ర ప్రదేశ్
 
Recommended Stories
Top Stories