Asianet News TeluguAsianet News Telugu

Fact Check : పంజాబ్ విక్టరీపై ప్రసంగం .. కేజ్రీవాల్‌ వాస్తవాల్ని దాచారా, ఢిల్లీలో ఆప్ చేసిన అభివృద్ధి ఎంటీ..?

పంజాబ్‌లో విజయం అనంతరం ఆప్ అధినేత , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ప్రసంగంలో సెల్ఫ్ డబ్బా ఎక్కువైందని.. వాస్తవాల్ని దాచారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

Fact Check on Arvind Kejiriwals Claims : Punjab Victory PC
Author
New Delhi, First Published Mar 10, 2022, 8:59 PM IST | Last Updated Mar 10, 2022, 8:59 PM IST

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని (Punjab Victory ) పురస్కరించుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత (aam aadmi party)అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం (arvind kejriwal) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ వాక్చాతుర్యం చూపించారు. తనను టెర్రరిస్ట్ అని పిలుస్తున్నప్పటికీ.. ఆప్ రాజకీయ ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ఆప్ కొత్త భారతదేశాన్ని తయారు చేస్తుందంటూ విజనరీ స్టేట్ మెంట్ ఇచ్చారు. 

దీని ప్రకారం :

  • భారతీయులు ఒకరినొకరు ప్రేమిస్తారని, ద్వేషించరు
  • ఎవరూ ఆకలితో నిద్రపోరు
  • తల్లులు, సోదరీమణులు సురక్షితంగా వుంటారు
  • విద్యార్ధులు వారి ఆర్ధిక నేపథ్యంతో సంబంధం లేకుండా మంచి నాణ్యమైన విద్యను పొందుతారు

ఇకపోతే దేశంలో వైద్య విద్యలో పురోగతి లేదని కొన్ని వాదనలు వున్నాయన్న కేజ్రీవాల్.. భారతీయులు విదేశాలకు  వెళ్లాల్సిన అవసరం లేని కొత్త భారతదేశాన్ని ఆప్ నిర్మిస్తుందన్నారు. 

భారతదేశంలో వైద్య విద్యపై వాస్తవాలు పరిశీలిస్తే:

1. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి వైద్య విద్య మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే అటల్ బిహారీ వాజ్‌పేజ్ ప్రధానిగా వున్నప్పుడు ఇంటర్‌రెగ్నమ్ మినహా.. మోడీ బాధ్యతలు చేపట్టే వరకు దేశంలో వైద్య విద్య మౌలిక సదుపాయాల నిర్మాణంలో దేశం చాలా తక్కువ పురోగతిని సాధించింది. 

2. 2014లో 387 మెడికల్ కాలేజీల్లో 54,348గా వున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2021 నాటికి 596 మెడికల్ కాలేజీల్లో 88,120 సీట్లకు పెరిగింది. ఇది కేవలం ఏడేళ్లలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో 62 శాతం సీట్లకు చేరిన పెరుగుదల. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) సంఖ్య 2014లో ఏడుగా వుండగా 22 నాటికి 20 చేరింది. 

3. కేజ్రీవాల్ ఢిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత గణాంకాలను చూస్తే.. 2014లో అక్కడ వైద్య కళాశాలల సంఖ్య 16 వుంటే.. గడిచిన ఏడేళ్లలో ఆప్ ప్రభుత్వం ఒకే ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. జాతీయ సగటు 62 శాతంతో పోల్చితే ఢిల్లీలో సీట్ల సంఖ్య 42 శాతం మాత్రమే పెరిగింది. 

ఇక ఢిల్లీలో మహిళల భద్రత గురించి వాస్తవాలు చూస్తే:

1. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఓటర్లలో ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు హిందువులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుంది. దేశ వ్యతిరేక శక్తుల కారణంగా చెలరేగిన ఢిల్లీ అల్లర్లలో భారీగా మరణాలు చోటు చేసుకున్నాయి. అంకిత్ శర్మ దారుణహత్య వెనుక ఆప్ నాయకుడు తాహిర్ హుస్సేన్ ప్రమేయం వుంది. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రత్యేక ప్రాసిక్యూటర్లకు అనుమతి లేకపోవడం కేజ్రీవాల్, ఆప్  సర్కార్ నైతిక వైఫల్యాన్ని సూచిస్తుంది.

2. అలాగే గతేడాది జనవరి 26న రైతుల నిరసన కారణంగా చోటుచేసుకున్న హింసకు సంబంధించి కూడా స్పెషల్ ప్రాసిక్యూటర్లను నియమించేందుకు ఆప్ ప్రభుత్వం నిరాకరించింది. ఇది మళ్లీ కేజ్రీవాల్ లోపానికి సూచన, అంతేకాదు శాంతి భద్రతల పట్ల ఆయనకున్న నిబద్ధత. 

3. కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక పదవుల్లో నియమించిన ప్రాసిక్యూటర్లు నేరాల పట్ల ‘లైవ్ అండ్ లెట్ బి’ విధానాన్ని కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది

4. డీటీసీ బస్సులు మహిళలకు పెద్ద వరం... ఢిల్లీ అంతటా సురక్షితంగా ప్రయాణించడానికి వారికి ఇది సహాయపడుతుంది. అయితే కేజ్రీవాల్ ప్రభుత్వం 5000 కొత్త బస్సుల హామీకి సంబంధించి ఒక్క డీటీసీ బస్సును కూడా కొనుగోలు చేయలేదు. 800 క్లస్టర్ బస్సులు ప్రైవేట్ వ్యక్తుల చేత నిర్వహించబడుతున్నాయి. ఈ విధానం మహిళలకు ఏమాత్రం సురక్షితం కాదు.

విద్యారంగంలో కేజ్రీవాల్ పనితీరు చూస్తే:

ఢిల్లీలో దాదాపు 20 కొత్త డిగ్రీ కళాశాలలు, 500 కొత్త పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి 2015లో ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అయితే వాస్తవం ఏంటంటే 1 డిగ్రీ కళాశాల మాత్రమే 2020 నాటికి పని చేస్తోంది. కానీ హామీ ప్రకారం కొత్త పాఠశాల ఏదీ నెలకొల్పలేదు. హామీకి బదులుగా 20,000 తరగతి గదులను ఏర్పాటు చేయడం ద్వారా AAP మోసం చేసింది.

2. 2020 వరకు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 45 శాతం ఉపాధ్యాయుల కొరత కూడా వుందని ఇండియాస్పెండ్ నివేదిక చెబుతోంది. ధనిక రాష్ట్రాలలో ఒకటిగా వున్నప్పటికీ ఢిల్లీ సర్కార్.. ఉపాధ్యాయ భర్తీని చేపట్టలేదు.

3. చాలా మంది తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్న నర్సరీ క్లాస్ అడ్మిషన్లను కేంద్రీకరిస్తామన్న ఆప్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక అసాధ్యమంటూ విద్యా మంత్రి మనీశ్ సిసోడియా రద్దు చేయడంతో ఈ విధానం ఆడిపోయింది. 

4. ప్రజల కోసం 3000 పాఠశాలల ప్లేగ్రౌండ్లను తెరుస్తామని ఆప్ హామీ ఇచ్చింది. అయితే కేవలం 77 పాఠశాలల ప్లేగ్రౌండ్లకు మాత్రమే ప్రకటనలు వెలువడ్డాయి.

5. ఆప్ 2015 నాటి తన మేనిఫెస్టోలో ‘ఉన్నత విద్య హామీ పథకం’కు హామీ ఇచ్చింది. దీని కింద ఏ విద్యార్థి అయినా ఢిల్లీ ప్రభుత్వం నుండి గ్యారెంటీ లేకుండా రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చని పేర్కొంది. దీని మొదటి చెక్ సెప్టెంబర్ 8, 2015న ప్రవేశపెట్టింది. అయితే 2018-19లో కేవలం 23 మంది మాత్రమే ఈ పథకం కింద రుణాలు  పొందారు. ప్రభుత్వం మాత్రం 50 మంది విద్యార్ధులకు రుణం అందుతుందని అంచనా వేసింది. 200 దరఖాస్తులు రావాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 139 మాత్రమే వచ్చాయి. 

తనను తాను ప్రశంసించుకున్న కేజ్రీవాల్

1. తన సహజ స్వభావానికి అనుగుణంగా, అరవింద్ కేజ్రీవాల్ తన 12 నిమిషాల ప్రసంగంలో తన పేరును 9 సార్లు ప్రస్తావించడం ద్వారా స్వీయ ప్రశంసలు పొందారు. ఇదే సమయంలో ఆయన పంజాబ్‌‌లో ఆప్ విజయానికి ప్రధాన కారణమైన భగవంత్ మాన్ గురించి చిన్న వ్యాఖ్య మాత్రమే చేశాడు.  

2. ఈ ప్రసంగం ఆయన పని శైలి గురించి చెబుతోంది. తాను ఆప్‌కి నాయకత్వం వహిస్తున్న ఏకైక నాయకుడు అని కేజ్రీవాల్ చెప్పుకున్నాడు. భగవంత్ మాన్ ముఖ్యమంత్రి కావచ్చునని పంజాబ్ ఎమ్మెల్యేలకు ఇది సంకేతం కావచ్చు, కానీ అతను అంటే కేజ్రీవాల్ పంజాబ్‌కు సూపర్ సీఎం అవుతాడు మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాడు. 

3. అరవింద్ కేజ్రీవాల్ ఈ వైఖరి కారణంగా ఆప్ తొలి నుంచి చాలామంది సీనియర్ నేతలు, వ్యవస్థాపక సభ్యులు పార్టీ నుంచి బహిష్కరణకు గురవ్వడమో లేదంటే వదిలి వెళ్లిపోయారు. అభద్రతా భావంతో కేజ్రీవాల్ పార్టీలో ఎవరినీ ఎదగనివ్వడం లేదని ఆప్ నేతలే అంటుంటారు. 

ఢిల్లీ హెల్త్ కేర్ వ్యవస్థను ఆప్ తప్పుగా నిర్వహిస్తుందా.. వివరాలు ఇవే

ఢిల్లీలోని ఆప్ ఆరోగ్య రంగం విషయంలో రాజీపడుతూ ఢిల్లీ వాసుల జీవితాలతో ఆడుకుంది. దేశంలోని ప్రస్తు పరిస్ధితుల దృష్ట్యా ఢిల్లీలో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆప్ నాసిరకం పాలనలో ఆరోగ్య రంగం ఎలాంటి అభివృద్ధిని నమోదు చేయలేదు.

1. ఆరోగ్య సంరక్షణ విషయంలో ఆప్ చాలా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నప్పటికీ.. అధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఢిల్లీలోని ఆసుపత్రుల్లో పడకలను ప్రతి 1000 మందికి గాను ఐదుకు పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ఢిల్లీలో ప్రతి 1000 మందికి 2.9 పడకలు మాత్రమే వున్నాయి. అందరికీ నాణ్యమైన మందులను సరసమైన ధరలకు హామీ ఇచ్చింది. కానీ దానిని ఉచిత మందుల జాబితా కిందకు కుదించింది. 

2. రాష్ట్ర ఎసెన్షియల్ డ్రగ్స్ జాబితా (EDL) లో 2016లో 406గా వున్న ఔషధాలను 1,390కి చేర్చుతామని హామీ ఇచ్చింది. కానీ రెండేళ్ల తర్వాత, ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ నివేదిక ప్రకారం.. వీటిని 2017లో 920 ఔషధాలకు, 2018లో 816 ఔషధాలకు తగ్గించింది. పారాసెటమాల్ టాబ్లెట్, పారాసెటమాల్ సిరప్ వంటివి - రెండూ వేర్వేరు మందులుగా పరిగణించబడుతున్నాయి. అందువల్ల సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీ (సిపిఎ) కొనుగోలు చేసిన మందుల సంఖ్య దాదాపుగా అలాగే ఉంది.

3. డిసెంబర్ 31, 2018 నాటికి రాష్ట్ర ప్రభుత్వ డిస్పెన్సరీలు, ఆసుపత్రులలో 34 శాతం వైద్య సిబ్బంది, 29 శాతం పారామెడికల్ సిబ్బంది కొరత వుంది. అలాగే మెడికల్ కాలేజీల్లో 66 శాతం లెక్చరర్ల కొరత వుంది. ఆప్ ఢిల్లీ ప్రజల జీవితాలలో ఆడుకోవడమే కాకుండా విద్యార్ధుల నాణ్యమైన వైద్య విద్య విషయంలో కూడా రాజీపడుతోంది.

4. ఆప్ అసమర్థ పార్టీ. సొంత పథకాలను అమలు చేయడమే కాకుండా కేంద్ర పథకాల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి సహాయాన్ని తీసుకురావడంలో కూడా విఫలమైన పార్టీ ఇది. ఈ పథకానికి కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసింది. NGO Praja నిర్వహించిన సర్వేలో, మొత్తం 85% మందిలో 6% మంది మాత్రమే ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరారు.

5. స్థానిక స్థాయిలో అందరికీ ఆరోగ్యం అందించడంలో ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్స్ చాలా ముఖ్యం. 2015లో ఆప్ అధికారంలోకి వచ్చినప్పుడు, 1000 మొహల్లా క్లినిక్‌లను ప్రారంభిస్తామని తెలిపారు. కానీ 2019 వరకు ఆప్ ప్రభుత్వం 203 మొహల్లా క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకురాగలిగింది. ఈ మొహల్లా క్లినిక్‌లు కూడా కోవిడ్ 19 సమయంలో మూసే వుంచారు. 

6. కరోనా సెకండ్ వేవ్ కారణంతా తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఆక్సిజన్ కొరత, క్రిటికల్ కేర్ పరికరాలు, ఐసీయూ బెడ్‌ల కొరత వేల మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు ప్రజలు. 

7. ఈ పరాజయం వెనుక వున్న ప్రాథమిక కారణం ఏంటంటే.. ఢిల్లీలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడమే. ఈ రంగంలోని నిపుణులు పదే పదే హెచ్చరించారు కూడా. 2021లో హౌసింగ్.కామ్ ప్రకారం.. హెల్త్ ఇన్‌ఫ్రా విషయంలో 8 నగరాల జాబితాలో ఢిల్లీ అట్టడుగున నిలిచింది. మార్చి 2020 నాటికి.. మొహల్లా క్లినిక్‌లను ఆదర్శంగా చూపేందుకు ఆప్ ప్రకటనలను ఊదరగొట్టింది. ఆ నాటికి 480 ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్‌లలో 270కి పైగా మూసివేయబడ్డాయి. అంతేకాదు 2015-19 మధ్యకాలంలో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఎలాంటి కొత్త ఆసుపత్రులను నెలకొల్పలేదని ఆర్టీఐ దరఖాస్తుకు స్వయంగా ఢిల్లీ ప్రభుత్వం జవాబిచ్చింది. దీని కారణంగా సెకండ్ వేవ్‌లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. 

8. ఢిల్లీలోని 50 శాతం పీహెచ్‌సీలు లేబర్ రూమ్‌లను కలిగి వుండగా.. సగం కంటే పీహెచ్‌సీలలో 4 పడకలు మాత్రమే వున్నాయి. 900 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడంతో పాటు 30,000 పడకలను అదనంగా ఏర్పాటు చేస్తామన్న ఆప్ హామీ నెరవేరలేదు. 2019లో 200 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడుస్తుండగా.. 170 పీహెచ్‌సీలను ఇంకా ప్రారంభించలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios