దగ్గుబాటివారింట పెళ్ళి సందడి, వెంకటేష్ కూతురి వెడ్డింగ్ కు ముహూర్తం ఫిక్స్.. ? వరుడు ఎవరంటే..?
టాలీవుడ్ సెలబ్రిటీల కుటుంబాలలో వరుసగా పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. మెగా ఫ్యామిలీ, మాగంటి ఫ్యామిలీతో పాటు.. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీలో కూడా పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి.

టాలీవుడ్ సెలబ్రిటీల కుటుంబాలలో వరుసగా పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. మెగా ఫ్యామిలీ, మాగంటి ఫ్యామిలీతో పాటు.. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీలో కూడా పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి.
ఈ ఏడాది టాలీవుడ్ లోని పెద్ద పెద్ద కుటుంబాల్లో వరుసగా పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఇప్పటికే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి.. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో జరగబోతోంది. పెళ్లి తంతు కోసం వరుణ్ తేజ్, లావణ్యలు ఇటలీ వెళ్లిపోయారు కూడా. ఇక రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు హీరో శ్రీసింహ.. టాలీవుడ్ స్టార్ సీనియర్ యాక్టర్ మాగంటి మురళీ మోహన్ మనవరాలితో పెళ్ళి జరగబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈరెండు సినిమా ఫ్యామిలీ పెళ్ళిళ్ళ గురించి వైరల్ అవుతుండగానే.. తాజాగా మరో స్టార్ హీరో కూతురు పెళ్ళికి రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది. హీరో వెంకటేష్ రెండు కూతురు పెళ్ళికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. దగ్గుబాటివారి ఇంట పెళ్లి సందడికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ కి మొత్తం నలుగురు పిల్లలు కాగా.. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇక వీరిలో పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి చాలా కాలం అయ్యింది.
ఇక వెంకటేష్ రెండో కూతురుకి పెళ్లి చేయబోతున్నట్టు తెలుస్తోంది. వెంకి మామ తన రెండో కూతురిని అత్తారింటికి పంపించడానికి వెంకీ మామ సిద్దమవుతున్నాడట. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడట వెంకటేష్. ఎంగేజ్మెంట్ కూడా ఈ నెలలోనే జరగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజం ఏంటో తెలియదు కాని.. ప్రస్తుతం న్యూస్ వైరల్ అవుతోంది.