సారాంశం


‘జవాన్‌’తో (Jawan) ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ హీరో షారుక్‌. ఇప్పుడు తాజాగా మరోదాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.  

షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జవాన్‌’. బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకున్న ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలై నెల అవుతున్నా ఇప్పటికీ థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే ‘జవాన్‌’తో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న షారుక్.. తాజాగా మరోదాన్ని సొంతం చేసుకున్నాడు.

సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1068  కోట్లకు పైగా వసూళ్లు చేసింది. హిందీలో ఈ సినిమా రూ.598 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు హిందీ చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మొన్నటి వరకు ‘గదర్‌-2’ పేరిట ఈ రికార్డు ఉండగా.. ‘జవాన్‌’ తాజాగా దాన్ని అధిగమించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘జవాన్‌’ నిర్మాణ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో షారుక్‌ అభిమానులు సంబరపడుతున్నారు.

ఇక డబ్బింగ్ వెర్షన్ విషయానికి వస్తే... 59.16 కోట్లు సాధించింది.  
తెలుగు నెట్ - 31 Cr
తమిళ నెట్ - 28.16  Cr

తెలుగులో ఓ హిందీ డబ్బింగ్ సినిమా ఇంత చేయటం పెద్ద రికార్డ్ అని చెప్పాలి. అలాగే తమిళం కన్నా తెలుగు కలెక్షన్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం. తమిళ మ్యూజిక్ డైరక్టర్, తమిళ డైరక్టర్, తమిళ నటీనటులు ఉన్నా ఇక్కడ తెలుగులో అక్కడని మించటం ఎవరూ ఊహించని విషయం. అట్లీ రెమ్యునరేషన్..కేవలం డబ్బింగ్ వెర్షన్స్ నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ షేర్ నుంచి రికవరీ అయ్యినట్లే.
 
రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై షారుక్‌ సతీమణి గౌరీఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్మీ బ్యాప్‌డ్రాప్‌లో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో షారుక్‌ విభిన్న గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘పఠాన్‌’ కూడా రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్స్‌ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే ఏడాది రెండుసార్లు రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాల్లో నటించిన ఏకైక భారతీయ నటుడిగా షారుక్‌ ఇప్పటికే రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక్క అమెరికాలో మాత్ర‌మే జ‌వాన్ 15 మిలియ‌న్ డాల‌ర్ల దాకా వ‌సూళ్లు రాబ‌ట్టింది. గ‌ల్ఫ్ కంట్రీస్ స‌హా ప‌లు దేశాల్లో జ‌వాన్ ప్ర‌భంజ‌నం సృష్టించింది.