`గాడ్ ఫాదర్`లో నటించడంపై సల్మాన్ ఖాన్ రియాక్షన్.. మల్టీస్టారర్ చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
`గాడ్ ఫాదర్`లో కీలక పాత్రలో నటించడంపై తాజాగా సల్మాన్ ఖాన్ స్పందించారు. అంతేకాదు మల్టీస్టారర్ సినిమాలు, సౌత్, నార్త్ అనే తేడాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి హీరోగా రూపొందించిన చిత్రం `గాడ్ ఫాదర్` విడుదలకు రెడీ అయ్యింది. ఈ నెల 5న దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఇందులో చిరంజీవితోపాటు సల్మాన్ ఖాన్ నటించడంతో క్రేజ్‌తోపాటు హైప్ నెలకొంది. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. సినిమాపై హైప్‌ని మరింత పెంచింది. అదే సమయంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ఎమోషనల్ స్పీచ్ గూస్ బంమ్స్ తెప్పిస్తుంది.
ఇందులో కొద్ది సేపు ఉండే కీలక పాత్రలో నటించడంపై తాజాగా సల్మాన్ ఖాన్ స్పందించారు. శనివారం ముంబయిలో `గాడ్ ఫాదర్` హిందీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. `గాడ్ ఫాదర్`లో నటించడంపై ఆయన మాట్లాడుతూ, చిరంజీవిగారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చేశానని తెలిపారు. సినిమాల పట్ల ఆయనకు, మాకున్న ప్రేమ ఈ సినిమాలో నటించేలా చేసిందన్నారు. చిరంజీవితో కలిసి నటించడం మంచి అనుభూతినిచ్చిందని, ఇందులో ఓ కొత్త పాత్ర చేశానని చెప్పారు.
ఈ సందర్బంగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు సల్మాన్. మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి తాను సిద్ధమే అని వెల్లడిచారు. మల్టీస్టారర్ చిత్రాలు చేయడం పరిశ్రమకి మంచిదన్నారు. అంతేకాదు సినిమాలకు సంబంధించి సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారని, నెంబర్స్ పెరుగుతాయని, ఇది ఇండియన్ ఫిల్మ్ అని చెప్పారు.`గాడ్‌ఫాదర్` తన తొలి తెలుగు సినిమా అని, కచ్చితంగా ఆడియెన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పారు.
ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `గాడ్ ఫాదర్`లో బలమైన పాత్ర కోసం సల్మాన్ అప్రోచ్ అవగానే `నేను చేయాలని మీరు కోరినట్లయితే మరో ఆలోచన లేకుండా చేస్తాను. మీరు ఇంకెం అలోచించకండి. నేను చేస్తా` అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. సల్మాన్ ఓకే చేశాక ఈ సినిమా ఆరా మరింత పెరిగింది. సల్మాన్ భాయ్ `గాడ్ ఫాదర్` లోకి రావడం ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. సల్మాన్ భాయ్ తో కలసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ గా చేశాను. ఆ జోష్ ని తెరపై చూస్తార`ని చెప్పారు చిరంజీవి. ఇది ఇండియన్ ఫిల్మ్ అని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సత్యదేవ్ చెబుతూ, `ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ ముందు నిలుచుని మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్య(చిరంజీవి) గారిపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అన్నయ్యకి ఎదురుగా నటించడం పెద్ద సవాల్. సల్మాన్ ఖాన్ గారి రూపంలో మరో సవాల్ వచ్చింది (నవ్వుతూ). ఇద్దరు మెగా స్టార్లు కి ఎదురుగా నిలబడే పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎప్పుడూ ఊహీంచలేద`ని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇద్దరు మెగా స్టార్లని డీల్ చేసే అవకాశం కావడం నా కల నెరవేరినట్టయ్యింది అని దర్శకుడు మోహన్‌రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, గెటప్ శ్రీను పాల్గొన్నారు. ఇందులో సత్యదేవ్, నయనతార, గెటప్ శ్రీను, సునీల్ కీలక పాత్రలు పోషించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.