`గర్ల్ ఫ్రెండ్` గా మారిన రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ..
రష్మిక మందన్నా ఆ మధ్య `ఆడవాళ్లు మీకు జోహార్లు` అంటూ లేడీ ఓరియెంటెడ్ టచ్ ఇచ్చింది. ప్రస్తుతం `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఇప్పుడు మరో సినిమాని ప్రకటించింది.
రష్మిక మందన్నా(Rashmika Mandanna).. విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ అని అంతా అనుకుంటున్నారు. దానిపై మాత్రం అటు రష్మికగానీ, ఇటు విజయ్ గానీ క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ నేషనల్ క్రష్ మాత్రం ఇప్పుడు నిజంగానే గర్ల్ ఫ్రెండ్‌గా మారింది. ఆమె `ది గర్ల్ ఫ్రెండ్`(The Girlfriend) పేరుతో సినిమా చేస్తుంది. అయితే ఈ బ్యూటీ నెమ్మదిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంటుంది. ఆ మధ్య `ఆడవాళ్లు మీకు జోహార్లు` అంటూ లేడీ ఓరియెంటెడ్ టచ్ ఇచ్చింది. ప్రస్తుతం `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఇప్పుడు మరో సినిమాని ప్రకటించింది.
`ది గర్ల్ ఫ్రెండ్` చిత్రంలో రష్మిక మెయిన్ లీడ్‌గా చేస్తుంది. ఆమె పాత్ర ప్రధానంగానే ఈ చిత్రం సాగబోతుంది. దీనికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. తాజాగా ఆదివారం ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు టైటిల్ ఫస్ట్ లుక్‌ని ప్రకటించారు. ఇందులో `నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానంటే.. దానికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ అక్కర్లేదురా.. నేను చాలు. 24గంటలు పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది. నాది అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా` అని చెబుతూ రష్మికని పరిచయం చేశారు.
అయితే ఇందులో రష్మిక వాటర్‌లో మునిగి స్మైల్ ఫేస్‌తో కనిపించింది. క్రమంగా సీరియస్‌గా మారింది. ఆ తర్వాత ఊపిరి వదిలింది. దీంతో టైటిల్ పడింది. చూడబోతుంటే ఇది మంచి కూల్ అండ్ ఫ్రెష్ లవ్ స్టోరీగా రూపొందబోతుందని తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత రాహుల్ రవీంద్రన్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఆయన గతంలో `చిలసౌ`, `మన్మథుడు 2` చిత్రాలకు దర్శకత్వం వహించారు. `చిలసౌ` పెద్ద హిట్ అయ్యింది. జాతీయ అవార్డుని అందుకుంది. కానీ `మన్మథుడు 2` డిజాస్టర్ అయ్యింది. దీంతో దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
ఈ సినిమాని ప్రకటిస్తూ రష్మిక పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె చెబుతూ, ప్రపంచం గొప్ప ప్రేమ కథలతో నిండిపోయి ఉంది. కానీ ఇప్పటి వరకు చూడని, వినని ప్రేమ కథలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి `ది గర్ల్ ఫ్రెండ్` అని చెప్పింది నేషనల్ క్రష్.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, దీరజ్ మోగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై విద్యా కొప్పినీది, ధీరజ్ మోగిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `బేబీ` తర్వాత మాస్ మూవీ మేకర్స్ పై వస్తోన్న చిత్రమిది. ఇప్పటికే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో ఓ ప్రాజెక్ట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రష్మిక మందన్నాతో `ది గర్ల్ ఫ్రెండ్` చిత్రాన్ని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈమూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం రష్మిక `పుష్ప2`, `యానిమల్`, `రెయిన్‌బో` చిత్రాలు చేస్తుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి మూవీలోనే హీరోయిన్‌గా నటించబోతుందని సమాచారం.