Asianet News TeluguAsianet News Telugu

Vijay Devarakonda: తన న్యూడ్ ఫోటోకు ప్యాంటు వేసిన నెటిజన్... విజయ్ దేవరకొండ డైరెక్ట్ రిప్లై!

విజయ్ దేవరకొండను న్యూడ్ గా చూడలేని ఓ నెటిజన్ ఫొటోకు  ప్యాంటు వేశాడు. ఇక ఆ ఎడిట్ పై విజయ్ దేవరకొండ స్వయంగా స్పందించారు. అసలేం జరిగిందో చూద్దాం...

netizen edits nude photo of vijay devarakonda he got reply
Author
Hyderabad, First Published Jul 2, 2022, 4:20 PM IST

ఓ క్రాక్ హీరోకి రూత్ లెస్ డైరెక్టర్ తోడైతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఏకంగా న్యూడ్ అట్టైర్ తో కూడిన ఎలివేషన్స్ రూపొందుతాయి. లైగర్(Liger) నుండి నేడు విడుదలైన విజయ్ దేవరకొండ లుక్ పెద్ద సంచలనానికి తెరలేపింది. పూర్తి నగ్నంగా ఉన్న విజయ్ దేవరకొండ జస్ట్ పూల గుచ్చాన్ని అడ్డుగా పెట్టి నిల్చున్నాడు. ఈ లుక్ కి మిశ్రమ స్పందన దక్కుతుంది. అనేక మంది సెలబ్రిటీలు స్పందించారు. సమంత నుండి జాన్వీ కపూర్ వరకు తమదైన కామెంట్స్ చేశారు. చివరికి అనుష్క శెట్టి సైతం ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడమే కాకుండా టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసింది. 

సాధారణ నెటిజెన్స్ మాత్రం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అర్థనగ్న ఫోటోపై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరహా ఫోజ్ కి అమీర్ ఖాన్ పాపులారిటీ తెచ్చారు. పీకే మూవీలో గ్రహాంతరవాసి గా అమీర్ నగ్నంగా  రేడియో అడ్డుపెట్టుకొని నిల్చున్న ఫోటో అప్పట్లో హాట్ టాపిక్. తర్వాత దానికి స్పూఫ్ గా క్యాలీఫ్లవర్ మూవీలో సంపూర్ణేష్ బాబు నగ్నంగా కనిపించారు. తాజాగా విజయ్ దేవరకొండ ఆ తరహా లుక్ ట్రై చేశారు. ఇక సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్ పై అనేక ట్రోల్స్, మీమ్స్ పేలుతున్నాయి. 

కాగా ఓ నెటిజన్ దేవరకొండ న్యూడ్ ఫోటోను ఎడిట్ చేసి ప్యాంటు వేశాడు. సదరు ఫోటోను ట్వీట్ చేయడంతో పాటు విజయ్ దేవరకొండను ట్యాగ్ చేశాడు. నాకు తర్వాత ధన్యవాదాలు చెప్పు బ్రదర్.. అంటూ కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ కి విజయ్ దేవరకొండ స్పందించారు. సకాలంలో ఆదుకునే నిజమైన బ్రదర్ నువ్వే.. అంటూ రిప్లై ఇచ్చాడు. నెటిజన్ కి విజయ్ దేవరకొండ రిప్లై ఇవ్వడం విశేషంగా మారింది. ఏమైనా ఇలా నగ్నంగా ఫోటోలు దిగాలంటే విజయ్ దేవరకొండ లాంటి హీరోలకే సాధ్యం. నేటి ఫోటో సినిమాకు భారీ ప్రచారం తెచ్చిపెట్టింది. 

పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో లైగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. లైగర్ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆగష్టు 25న పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో లైగర్ విడుదల కానుంది. రమ్య కృష్ణ ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. 

మరోవైపు పూరి-విజయ్ కాంబినేషన్ లో జనగణమన తెరకెక్కుతుంది. లైగర్ విడుదల కాకుండానే జనగణమన చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు పూరి. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios