Asianet News TeluguAsianet News Telugu

‘జవాన్’ నుంచి నయనతార ఫస్ట్ లుక్.. యాక్షన్ మోడ్ లో లేడీ సూపర్ స్టార్

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) బాలీవుడ్ లోకి తొలిసారి ‘జవాన్’తో ఎంట్రీ ఇస్తోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న మూవీ నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. వైరల్ గా మారింది. 
 

Nayantharas first look from Jawan movie poster Goes Viral NSK
Author
First Published Jul 17, 2023, 3:48 PM IST | Last Updated Jul 17, 2023, 3:48 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కొద్దిరోజుల్లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తొలిసారిగా హిందీ ఫిల్మ్ ‘జవాన్’లో నటిస్తుండటం, పైగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  సరసన ఆడిపాడుతుడటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ కు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తమ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 

ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై హైప్ ను పెంచుతూ వస్తోంది. షారుఖ్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ తర్వాత భారీ అంచనాలు పెరిగాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ‘జవాన్’ ట్రైలర్ తో తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ చిత్రంలో నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. తాజాగా నయన్ తార ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. 

ఫస్ట్ లుక్ పోస్టర్ లో నయన తార చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. యాక్షన్ మోడ్ లో లేడీ సూపర్ స్టార్ అదరగొట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ నయనతార యాక్షన్ సినిమాల్లో నటించింది. చాలా తక్కువనే చెప్పాలి. అప్పట్లో ‘ఇంకొక్కడు’ చిత్రంలో కాస్తా యాక్షన్ తో అదరగొట్టింది. ఇక ఫుల్ రోల్ యాక్షన్ తో jawanలో అలరించబోతోంది. తాజాగా విడుదలైన పోస్టర్ లో వెపన్ చేతిలో పట్టుకొని ఇంటెన్సివ్ లుక్ లో ఆకట్టుకుంది. తన రోల్ పై మరింత హైప్ పెంచేంది.

చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు నటిస్తున్నారు. విజయ్, సంజయ్ దత్, దీపికా పదుకొణె క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్’తో చివరిగా షారుఖ్ ఖాన్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించడంతో ‘జవాన్’పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇక నయనతార గతేడాది తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకూ తల్లిగా మారింది. లైఫ్ లో సెటిల్ అయిన లేడీ పవర్ స్టార్ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. గతేడాది ఏకంగా ఐదు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ‘గాడ్ ఫాదర్’లో మెరిసింది. ప్రస్తుతం ‘జవాన్’తో పాటు మరో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios