Asianet News TeluguAsianet News Telugu

మహి వి రాఘవ్ 'సైతాన్' ట్రైలర్.. బాబోయ్ మరీ పచ్చిగా.. బూతులే బూతులు

వైఎస్సార్ బయోపిక్ యాత్రతో గుర్తింపు పొందిన దర్శకుడు మహి వి రాఘవ్ ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే మహి వి రాఘవ్ సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఇది డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో విడుదలయింది. ఈసారి మహి వి రాఘవ్ కంప్లీట్ డిఫెరెంట్ ప్రాజెక్టు ఎంచుకున్నారు.

Mahi V Raghav Shaitan web series trailer out now dtr
Author
First Published Jun 5, 2023, 2:30 PM IST

వైఎస్సార్ బయోపిక్ యాత్రతో గుర్తింపు పొందిన దర్శకుడు మహి వి రాఘవ్ ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే మహి వి రాఘవ్ సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలయింది. ఈసారి మహి వి రాఘవ్ కంప్లీట్ డిఫెరెంట్ ప్రాజెక్టు ఎంచుకున్నారు. క్రైమ్ నేపథ్యంలో సాగే 'సైతాన్' అనే వెబ్ సిరీస్ ని ఆయన తెరకెక్కించారు. 

నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఇప్పుడు కొత్త ఫిలిం మేకర్స్ అంతా ఓటిటి వేదికగా క్రైమ్ నేపథ్యంలో కథని ఎంచుకుని దానిని బోల్డ్ గా ప్రజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అంశంలో దర్శకుడు మహి వి రాఘవ్ బౌండరీలన్నీ బ్రేక్ చేసేసినట్లు ఉన్నారు. ట్రైలర్ చూస్తే అదే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ ఉన్న బూతులని ఇంకే సిరీస్ లో కానీ మూవీ లో కానీ విని ఉండరు. అంత పచ్చిగా లేడీ ఆర్టిస్టులే బూతులతో రెచ్చిపోతున్నారు. 

ఇక క్రైమ్ డ్రామా కాబట్టి వణుకు పుట్టించే.. రక్త సిక్తమైన సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక ఫ్యామిలీ దారుణంగా హత్యలు చేయడం ఇందులో చూపించారు. జస్ట్ ట్రైలర్ లోనే ఇలా ఉంటె.. ఇక సిరీస్ మొత్తం ఎలా ఉండబోతోందో. 

ట్రైలర్ లాంచ్ లో మహి వి రాఘవ్ మాట్లాడుతూ ఇలాంటి ఇంటెన్స్ కథకి అలాంటి డైలాగ్స్ వాడాల్సి వచ్చింది అని అన్నారు. ఇందులో న్యూడిటీ, అభ్యంతరక డైలాగులు అన్నీ ఉన్నాయి. ట్రైలర్ లోనే ముందుగా చూపించాం. కాబట్టి అన్నింటికీ సిద్ధపడిన వారు మాత్రమే సైతాన్ సిరీస్ చూడండి అని కోరారు. వయలెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అని హెచ్చరించారు. మహిళా ఆర్టిస్టులు పురుషుల ప్రైవేట్ పార్ట్స్ గురించి దారుణంగా బూతులు మాట్లాడుతున్న సందర్భాలు ట్రైలర్ లో చాలా ఉన్నాయి. 

సైతాన్ లో రిషి, దేవియాని, షెల్లీ ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 15న సైతాన్ వెబ్ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలు కానుంది. ఈ సిరీస్ కేవలం పెద్ద వారికి మాత్రమే. అది కూడా చూడగలిగే వారు మాత్రమే చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios