మహేష్ ముద్దుల కూతురు సితార సాహసాలు చేస్తుంది. పదేళ్ల వయసు నిండకుండానే హార్స్ రైడింగ్ వంటి డేంజరస్ స్టంట్స్ లో పాల్గొంటుంది. సితార హార్స్ రైడింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సితార ఘట్టమనేని (Sitara Gattamaneni) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. మహేష్ కూతురిగా కంటే కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది. స్టార్ హీరోయిన్ గా వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. అలాగే డాన్స్ వీడియోలు షేర్ చేస్తుంది. ఇక సర్కారు వారి పాట మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. పెన్నీ పెన్నీ సాంగ్ ప్రోమోలో సితార మెస్మరైజింగ్ స్టెప్స్ తో అలరించిన విషయం తెలిసిందే. ఇంస్టాగ్రామ్ లో సితార ఫాలోయింగ్ ఎనిమిది లక్షలకు దగ్గరైంది. ఈ వయసులోనే ఆ రేంజ్ ఫాలోయింగ్ అంటే అర్థం చేసుకోవచ్చు , సితార రేంజ్ ఏమిటో.
కాగా సితార పసిప్రాయంలోనే సాహసాలకు ఒడిగడుతుంది. హార్స్ రైడింగ్ లాంటి డేంజరస్ స్టెంట్స్ చేస్తున్నారు. సితార ఓ గుర్రపు శాలలో హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారు. ట్రైనర్స్ పర్యవేక్షణలో హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. గుర్రాన్ని పరుగులు పెట్టిస్తూ, మచ్చిక చేసుకుంటున్న సితార సాహసాలకు ఆమె అభిమానులు అబ్బుర పడుతున్నారు. ఇక మహేష్ కుమారుడు గౌతమ్ కూడా ఆ వీడియోలో ఉన్నాడు. సితార హార్స్ రైడింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సితార ఎనర్జీ చూస్తుంటే పెద్దయ్యాక స్టార్ గా వెలిగిపోతారనిపిస్తుంది. మహేష్ కి పిల్లంటే ప్రాణం. ఏమాత్రం వైరం దొరికినా కుటుంబంతో పాటు వివాహారానికి చెక్కేస్తారు. ప్రతి ఏడాది పలుమార్లు విదేశీ టూర్స్ కి వెళుతూ ఉంటారు. మహేష్ (Mahesh Babu)ఫ్యామిలీ సందర్శించని ప్రదేశం లేదేమో. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. జులై నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది.