Asianet News TeluguAsianet News Telugu

Trolls On Madhavan: పిచ్చిమాటలు మాట్లాడుతున్నావ్.. నోరుమూసుకో.. హీరో మాధవన్ పై దారుణంగా ట్రోలింగ్

తమిళ హీరో మాధవన్ ను ఏకిపడేస్తున్నారు నెటిజన్లు. ఓ ప్రెస్ మీట్ లో మాధవన్ చేసిన వ్యాఖ్యలకు హర్ట్ అయిన సోషల్ మీడియా జనాలు.. ధారుణంగా తిట్టిపోస్తున్నారు. నోరు మూసుకుని కూర్చోమంటున్నారు. 
 

Madhavan Gets Trolled For Claiming ISRO Used Hindu Calendar
Author
Hyderabad, First Published Jun 26, 2022, 5:57 PM IST

సౌత్ అన్ని భాషలతో పాటు  బాలీవుడ్‌లోనూ హీరోగా  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. రొమాంటిక్ హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ ఇమేజ్ తో పాటు ఎంతో మంది అమ్మాయిల మనసుదొచుకున్న హీరో మాధవన్. ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది ఈ మూవీ. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్, స్టార్‌ హీరో సూర్య కీలక పాత్రల్లో నటించారు. 

 ఈ సినిమాను  తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జులై 1న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. దీంతో ప్రమోషన్‌లో భాగంగా మూవీ టీమ్  వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పట్టకే స్టార్ట్ చేశారు కూడా. అయితే ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో హీరో మాధవన్ అన్న మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన్ను ధారణంగా ట్రోల్ చేసే విధంగా మారాయి. 

ఈ క్రమంలోనే మాధవన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నాయి. ఓ ప్రెస్‌ మీట్‌లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాగం ఉపయోగపడిందని మాధవన్‌ అన్నాడు. 'ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్‌ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి.' అని మాధవన్‌ వ్యాఖ్యలు చేశాడు. 

 

ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ కాగా నెటిజన్స్‌ ట్రోలింగ్‌తో ఏకిపారేస్తున్నారు. సైన్స్‌ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అలా అని సైన్స్‌ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది, మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా ?, ఇవేం పిచ్చి మాటలు' అంటూ వరుస కామెంట్లతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. 

 

అయితే ఈ ట్రోలింగ్‌పై తాజాగా మాధవన్‌ స్పందించాడు. తమిళంలో పంచాంగం గురించి మాట్లాడినందుకు ఇది ట్రోలింగ్‌ సరైనదే. నేను ఎంతటి అజ్ఞానిని. కానీ మార్స్ మిషన్‌లో మనం కేవలం 2 ఇంజిన్‌లతో సాధించామనే నిజాన్ని ఎవరు మార్చలేరు. దానికదే రికార్డు సృష్టించగలిగింది. వికాస్‌ ఇంజిన్‌ ఒక రాక్‌స్టార్‌. అని ట్వీట్‌ మాధవన్‌ ట్వీట్‌ చేశాడు
 

Follow Us:
Download App:
  • android
  • ios