Rakul Preeth Singh: రకుల్ హాట్ వర్క్ అవుట్ వీడియో... ఆమెకు కాదు, చూస్తున్న మీకు చెమటలు పడతాయి!
రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ వీడియో షేర్ చేశారు. ప్రతిరోజూ తానెంత కష్టపడుతుందో తెలియజేశారు. రకుల్ వర్క్ అవుట్ వీడియో వైరల్ అవుతుంది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఫిట్నెస్ అంటే అమిత ఇష్టం. కఠిన కసరత్తులు చేసే ఈ భామ జీరో సైజ్ మైంటైన్ చేస్తుంది. కెరీర్ బిగినింగ్ లో రకుల్ కొంచెం బొద్దుగా ఉండేవారు. బాలీవుడ్ కి వెళ్ళాక ఆమె శరీరాన్ని సన్నజాజి తీగలా మార్చేసింది. క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అవలంబిస్తూ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటున్నారు. రకుల్ దినచర్యలో వ్యాయామం, యోగా కచ్చితంగా ఉంటాయి. అలాగే డైట్ విషయంలో కూడా స్ట్రిక్ట్ గా ఉంటుంది.
రకుల్ తాజాగా ఓ వర్క్ అవుట్ వీడియో షేర్ చేశారు. టైట్ ఫిట్ లో రకుల్ సూపర్ హాట్ గా ఉంది. ఆమె వ్యాయామం చేస్తుంటే వీడియో చూస్తున్న కుర్రాళ్లకు చెమటలు పడుతున్నాయి. రకుల్ ప్రీత్ ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది. హెల్త్ అండ్ ఫిట్నెస్ విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండే రకుల్ మీద డ్రగ్స్ ఆరోపణలు రావడం విశేషం. హైదరాబాద్, ముంబై నగరాల్లో డ్రగ్స్ ఆరోపణలపై రకుల్ విచారణ ఎదుర్కొన్నారు.
మరోవైపు రకుల్ టాలీవుడ్ కి పూర్తిగా దూరమయ్యారు. వరుస పరాజయాల నేపథ్యంలో మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని షేక్ చేసిన రకుల్ ఫేడ్ అవుట్ అయ్యింది. అయితే ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. అక్కడ ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. గత మూడు నాలుగేళ్లుగా రకుల్ బాలీవుడ్ లో మకాం వేశారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కెరీర్ కూడా నెమ్మదించిన తరుణంలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రకుల్ ఈ వార్తలను ఖండిస్తున్నారు. జీవితంలో పెళ్లి కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. పెళ్లి కుదిరినప్పుడు చెబుతాను, ప్రతిసారి విసిగించకండి అంటూ మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నారు. 2021లో రకుల్ నటుడు జాకీ భగ్నానీని ప్రియుడిగా పరిచయం చేసింది. అప్పటి నుండి ఆమె పెళ్లి రూమర్స్ మొదలయ్యాయి.