ప్రజెంట్ జనరేషన్‌ సినిమాల్లో లిప్‌ లాక్స్‌, బోల్డ్స్ సీన్స్ చాలా కామన్‌. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఏ సర్టిఫికేటెడ్ సినిమాలు ఇప్పుడు చాలా కామన్‌ అయిపోయాయి. ప్రజెంట్ హీరోయిన్లందరూ లిప్‌ లాక్‌ సీన్స్‌కు ఈజీగా ఓకె చెప్పేస్తున్నారు. కథ డిమాండ్ చేస్తుందంటూ హద్దులు దాటేస్తున్నారు. అయితే ఈ జనరేషన్‌కు కామనే అయిన అసలు ఇండియన్‌ స్క్రీన్‌ మీద తొలి లిప్‌ లాక్‌ ఎప్పుడు చిత్రీకరించారు. ఈ అనుమానం  చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1933లో ఇండియన్‌ స్క్రీన్‌ మీద తొలి లిప్‌ లాక్‌ను చిత్రీకరించారు.

అంతేకాదు ఆ సన్నివేశం ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో రూపొందించారట. కర్మ అనే హిందీ సినిమాలో ఈ సన్నివేశం దేవికా రాణి, హిమాన్షు రాయ్‌లపై చిత్రీకరించారు. దేవికా, హిమాన్షులు నిజ జీవితంలో కూడా భార్యా భర్తలు కావటంతో ఈ సీన్‌లో నటించేందుకు అంగీకరించారట. అయితే అప్పట్లోనే ఆ సీన్‌కు అంత బోల్డ్ గా అంగీకరించినా.. సెన్సార్ బోర్డ్ ఆ సీన్‌కు భారీగా కత్తెర వేసింది. అంతేకాదు సినిమాకు ఏ సర్టిఫికేట్‌ జారీ చేయటంతో అప్పట్లో చాలా ప్రాంతాల్లో ఈ సినిమా విడుదల కాలేదు.

ఈ సినిమా తరువాత కూడా లిప్‌ లాక్‌ సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు చాలా కాలం పాటు సాహసించలేదు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి మన సినిమాల్లో కూడా పాశ్చ్యత్య పోకడలు పెరగటంలో బికినీలు, బెడ్‌ రూం సీన్లు, లిప్ లాక్‌లు కామన్‌ అయిపోయాయి. ప్రస్తుతం రిజినల్ సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు తరుచూ కనిపిస్తున్నాయి.