తమ్ముడి అవతారం ఎత్తిన భోళా శంకర్.. పవన్ మ్యాటర్ లీక్ చేసిన చిరు, మెగా ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం అందరికంటే ఎక్కువగా డైరెక్టర్ మెహర్ రమేష్ కే ఇంపార్టెంట్.
భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ అయితే దక్కించుకోలేకపోయింది. పాటలు కూడా సో సో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో భారం మొత్తం మెగాస్టార్ దే అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతవరకు ఫ్యాన్స్ కి కిక్కిచ్చే విధంగా ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా రాలేదు.
తాజాగా చిరు మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకునే లీక్ ఒకటి బయట పెట్టారు. ఇటీవల మెగాస్టార్ చిరు లీక్స్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన లీక్ చేసిన విషయం ఏంటంటే.. భోళా శంకర్ చిత్రంలో చిరు కొన్ని సన్నివేశాల్లో తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయబోతున్నారట.
పవన్ తన చిత్రాల్లో అన్నయ్యపై ప్రేమ కురిపిస్తూ మెగాస్టార్ డైలాగ్స్ చెప్పడం, డ్యాన్సులు వేయడం చూశాం. ఇప్పుడు తాను కళ్యాణ్ బాబుని ఇమిటేట్ చేస్తూ పవన్ డైలాగ్స్ చెబుతానని చిరు లీక్ చేశారు. శాంపిల్ గా 'ఏ మేరా దునియా' అంటూ ఖుషి చిత్రంలో పాటకి చిరు డ్యాన్స్ చేశారు. అంతే కాదు పవన్ లాగా మెడపై చేయి వేసుకుని అనుకరించారు. ఇలాంటివి భోళా శంకర్ లో చాలానే ఉన్నాయట. చిరు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.