రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. ఎంపీగా పోటీచేయనున్న బిగ్ బీ తనయుడు ?
బిగ్ బీ అమితాబచ్చన్ ఫ్యామిలీ నుంచి మరో యువ రాజకీయ కెరటం ఎగరబోతోంది. ఇప్పటికే అమితాబ్ తో పాటు.. ఆయన భార్య జయా బచ్చన్ కూడా పాలిటిక్స్ లో ఉండగా.. తాజాగా అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం అవుతోంది.

బిగ్ బీ అమితాబచ్చన్ ఫ్యామిలీ నుంచి మరో యువ రాజకీయ కెరటం ఎగరబోతోంది. ఇప్పటికే అమితాబ్ తో పాటు.. ఆయన భార్య జయా బచ్చన్ కూడా పాలిటిక్స్ లో ఉండగా.. తాజాగా అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం అవుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ రాజకీయ ఆరంగేట్రానికి సిద్దం అవుతున్నారు. సీనీరాజకీయ వర్గాల నుంచి అందుతున్నసమాచారం ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ వారసత్వం తీసుకున్న అభిశేక్ హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కాని ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వలేకపోయాడు. ఇక ఇప్పుడు వారి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. తన తల్లి, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ.. ఎంపీగా అభిషేక్ బచ్చన్ నిలబడబోతున్నట్టు తెలుస్తోంది.
అభిషేక్ బచ్చన్ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని సమాచారం. అభిషేక్ బచ్చన్ తండ్రి అమితాబ్ బచ్చన్ 1984లో కాంగ్రెస్ తరపున ఇదే స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు బరిలోకి దిగిన ఆయన లోక్‌దళ్ అభ్యర్థి హెచ్ఎన్ బహుగుణపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అమితాబ్ కు భారీ మెజారిటీ ఇచ్చిన ఈ స్థానం నుంచే.. అభిషేక్ ను కూడా రంగంలోకిదింపాలని చూస్తున్నారట సమాజ్ వాదీ పార్టీ నేతలు.
ఇక అభిషేక్ తల్లి, సమాజ్‌వాదీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. అంతే కాదు జయాబచ్చన్ ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్ లో ఉన్నారు. దీంతో, అభిషేక్‌ను కూడా రంగంలోకి దింపాలని ఎస్పీ అగ్రనేతలు అనుుకుంటున్నారట. అభిషేక్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడలేక పోయారు. దాంతో రాజకీయంగా అయినా తనేంటో నిరూపించుకుని.. నాయకుడిగా ఎదగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో అభిషేక్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
అయితే జాతీయ మీడియాలో ఈ రూమర్స్ ఎక్కువగా కావడంతో సమాజ్ వాదీ పార్టీ స్పందించింది. తమ పార్టీ తరుపున అభిషేక్ బచ్చన్ ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ ప్రయాగ్ రాజ్ అధ్యక్షుడు సయ్యద్ ఇఫ్తికర్ హుస్సేన్ మాట్లాడుతూ.. అభిషేక్ బచ్చన్ తమ పార్టీ తరుపున ప్రయాగ్ రాజ్ నుంచి పోటీ చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదు. ఈ వార్తలని నమ్మకండి. ఏదైనా ఉంటె పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది అని అన్నారు.