అమెరికా సెక్స్ రాకెట్: యాంకర్ శ్యామల వెర్షన్ ఇది..

anchor shayamala on america sex racket
Highlights

నేను అమెరికా వెళ్లినప్పుడు అందరితో కలిసి హోటల్స్ లో ఉండడం కంటే మా చుట్టాల ఇళ్లల్లో ఎక్కువగా గడుపుతుంటాను. పైగా ఆ సమయంలో ఫోన్ కూడా వాడను. నాకు ఎప్పుడు అలాంటి కాల్స్ కూడా రాలేదు

బిగ్ బాస్ సీజన్ 2 నుండి నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామల పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా ఆమెకు అమెరికా సెక్స్ రాకెట్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. శ్యామల కూడా అమెరికాలో ఈవెంట్స్ కోసం వెళ్తుంటుంది.

దీంతో ఆమె సెక్స్ రాకెట్ కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా..? అనే విషయాన్ని ప్రస్తావించగా.. శ్యామల చాలా కూల్ గా సమాధానాలు చెప్పుకొచ్చింది. ''నేను అమెరికా వెళ్లినప్పుడు అందరితో కలిసి హోటల్స్ లో ఉండడం కంటే మా చుట్టాల ఇళ్లల్లో ఎక్కువగా గడుపుతుంటాను. పైగా ఆ సమయంలో ఫోన్ కూడా వాడను. నాకు ఎప్పుడు అలాంటి కాల్స్ కూడా రాలేదు. నేను పాల్గొనే ఈవెంట్స్ అన్నీ కూడా పెద్ద ఆర్గనైజేషన్స్ కు సంబంధించినవే.. దీంతో వారు మా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఎలా తీసుకొచ్చారో.. అలా పంపించేవారు.

ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేవారు. నేను వెళ్లేది కూడా ఏడాదికి మహా అయితే ఒకసారి. రెండు, మూడు ఈవెంట్స్ లో పాల్గొనడం, ఈవెంట్ పూర్తయిన వెంటనే రిలేటివ్స్ ఇంటికి వెళ్లిపోవడం ఇంతే జరిగేది. దీంతో నాకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఈ విషయం గురించి నాతో ఎప్పుడూ మాట్లాడలేదు'' అంటూ స్పష్టం చేసింది.   

loader