Green Diamond: గ్రీన్ డైమండ్ అంటే ఏంటి ? పీఎం మోదీ అమెరికా అధ్యక్షుడి భార్యకు దీన్ని బహుమతిగా ఎందుకు ఇచ్చారు?

ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సతీమణి జిల్ బిడెన్‌కు ప్రత్యేక బహుమతిగా గ్రీన్ డైమండ్ అంించారు. ఇది యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ గ్రీన్ డైమండ్‌ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఇంతకీ గ్రీన్ డైమండ్ అంటే ఏంటి..? దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ..?

What is special about the green diamond that Prime Minister Modi gifted to US President Joe Biden's wife MKA

గ్రీన్ డైమండ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతులను కలిసేందుకు వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ భారత్ తరపున అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, అలాగే అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌లకు ప్రత్యేక బహుమతులను అందించారు. ఇందులో గ్రీన్ డైమండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ గ్రీన్ డైమండ్‌ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంతకీ గ్రీన్ డైమండ్ అంటే ఏంటి..? దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. 

గ్రీన్ డైమండ్ అంటే ఏంటి..?
అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అత్యంత ప్రత్యేకమైన బహుమతిగా గ్రీన్ డైమండ్ ను పరిగణిస్తున్నారు. ఈ గ్రీన్ డైమండ్ సూరత్‌కు చెందిన ఓ ల్యాబ్ లో తయారు చేశారు. సహజంగా అయితే వజ్రాలను గనుల్లో నేల నుంచి వెలికి తీసి దాన్ని సానపెడతారు. కానీ ఈ గ్రీన్ డైమండ్ మాత్రం ల్యాబ్ లో తయారు చేశారు. గనులలో లభించే సహజ వజ్రాల లాగా కాకుండా, ప్రయోగశాలలో ఈ వజ్రాలను తయారు చేశారు. ల్యాబ్‌లో తయారు చేసిన ఈ వజ్రాలు ల్యాబ్ లో రసాయన ప్రాసెసింగ్ చేయడం ద్వారా తయారు చేస్తారు. ఈ గ్రీన్ డైమండ్ చూడటానికి అసలైన వజ్రంలాగే ఉంటుంది. దీన్ని గుర్తించడం కష్టం ఎందుకంటే వాటి మెరుపు, రంగు సహజ వజ్రాల లాగా ఉంటాయి. 

సహజ వజ్రాలకు, గ్రీన్ డైమండ్ మధ్య తేడాల ఏంటి..?
గ్రీన్ డైమండ్ ల్యాబ్‌లో కృత్రిమంగా సృష్టిస్తారు. నిజానికి ఒక వజ్రం సహజంగా ఏర్పడటానికి వేల సంవత్సరాలు పడుతుంది. కానీ ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలు 3 నుంచి 4 వారాల్లోనే సిద్ధం అవుతుంటాయి. ప్రయోగశాలలో తయారు చేసిన ఈ వజ్రాలు సహజ వజ్రాల వలె కనిపిస్తాయి. సహజ వజ్రాలకు, గ్రీన్ డైమండ్ కు మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే, సహజ వజ్రాలలో నత్రజని ఉంటుంది, అయితే ప్రయోగశాలలో తయారు చేసిన గ్రీన్ డైమండ్ లో ఉండదు. 

సహజంగా ఏర్పడిన వజ్రాలు తయారవడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. వజ్రాలు భూమి లోపల అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత వద్ద ఏర్పడతాయి. సరళమైన భాషలో చెప్పాలంటే భూమి లోపల ఖననం చేసిన కార్బన్ అధిక వేడి, ఉష్ణోగ్రతకు గురైనప్పుడు అది నెమ్మదిగా వజ్రం ఆకారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తుంది. అలా సహజ వజ్రం ఏర్పుడుతుంది. ల్యాబ్ మేడ్ గ్రీన్ డైమండ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వజ్రాలను ప్రధానంగా ల్యాబ్‌లో రెండు రకాలుగా తయారుచేస్తారు. మొదటిది HPHT అంటే హై ప్రెజర్, హై టెంపరేచర్ టెక్నాలజీ రెండవది CVD అంటే కెమికల్ వేపర్ డిపాజిషన్ పద్ధతిని ఉపయోగించి సృష్టిస్తారు. 

HPHT లేదా CVD టెక్నిక్‌ల ద్వారా ల్యాబ్‌లో వజ్రాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు, ఈ రెండు పద్ధతుల్లో కార్బన్ సీడ్స్ అవసరమవుతాయి. కార్బన్ సీడ్ ను మైక్రోవేవ్ చాంబర్‌లో ఉంచడం ద్వారా ఈ గ్రీన్ డైమండ్ తయారు చేస్తారు. తర్వాత 1,500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 730,000 psi అధిక పీడనాలకు గురిచేస్తారు. ఈ ప్రక్రియలో కార్బన్ సీడ్స్ క్రమంగా వజ్రాలుగా మారుతాయి. డైమండ్ ఇండస్ట్రీస్ ప్రకారం, సహజ వజ్రాల కంటే ల్యాబ్ గ్రీన్ డైమండ్స్ ధర 80 నుండి 85 శాతం తక్కువ. తక్కువ ధర కారణంగా, ల్యాబ్‌లో పెరిగిన వజ్రాల డిమాండ్, అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి.

ప్రధాని మోడీ ఈ గ్రీన్ డైమండ్ ను అమెరికా ప్రథమ మహిళకు ఇవ్వడానికి గల కారణం ఈ వజ్రాన్ని  సౌర పవనశక్తితో ఉత్పత్తి చేసిన విద్యుత్తు ద్వారా తయారు చేశారు.  దీని నుంచి ఎలాంటి కాలుష్య కారకాలు వెలువడలేదు. పర్యావరణ పరిరక్షణకు  రెన్యువబుల్ ఎనర్జీ  ఆవశ్యకతను గుర్తు చేస్తూ,  ప్రధాని మోడీ ఈ గ్రీన్ డైమండ్ ను బహుకరించారు .

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios