Asianet News TeluguAsianet News Telugu

మీకు ఆధార్ కార్డు ఉందా.. అయితే దుర్వినియోగం కాకుండా ఇలా చేయండి..

మీ ఆధార్ కార్డు లేదా ఆధార్ నంబర్ దుర్వినియోగం అవుతోందని ఒకవేళ భావిస్తే, అందుకోసం యూఐడీఏఐ కూడా ఆధార్‌ను లాక్ చేసి అన్‌లాక్ చేసే సదుపాయాన్ని కల్పించింది. అంటే, వినియోగదారు తన ఆధార్ కార్డును ఎప్పుడైనా లాక్ చేయవచ్చు, ఎప్పుడైనా ఉపయోగించాల్సి వచ్చినప్పుడు అన్‌లాక్ చేయవచ్చు.

lock aadhaar card number with 16 digit virtual id check details here
Author
Hyderabad, First Published Aug 18, 2020, 5:28 PM IST

ఈ రోజుల్లో ప్రతి భారతీయుడి జీవితంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రతి ముఖ్యమైన పనిలో ఆధార్ కార్డ్ ఉపయోగించడమే కాకుండా, మన ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేలా గుర్తుంచుకోవాలి. మీ ఆధార్ కార్డు లేదా ఆధార్ నంబర్ దుర్వినియోగం అవుతోందని ఒకవేళ భావిస్తే, అందుకోసం యూఐడీఏఐ కూడా ఆధార్‌ను లాక్ చేసి అన్‌లాక్ చేసే సదుపాయాన్ని కల్పించింది.

అంటే, వినియోగదారు తన ఆధార్ కార్డును ఎప్పుడైనా లాక్ చేయవచ్చు, ఎప్పుడైనా ఉపయోగించాల్సి వచ్చినప్పుడు అన్‌లాక్ చేయవచ్చు. ఆధార్ కార్డును ఎలా లాక్ చేయలో, అన్‌లాక్ చేయలో పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఆధార్ కార్డును లాక్ చేయడం అంటే ఆధార్ కార్డు యొక్క 12-అంకెల సంఖ్య స్థానంలో 16-అంకెల వర్చువల్ ఐడీని (వీఐడీ) ఉపయోగించడమే. ఆధార్ నంబర్‌ను యూఐడీ అని కూడా పిలుస్తారు. అంటే ప్రత్యేకమైన ఐడీ సంఖ్య.. వర్చువల్ ఐడీలో చిన్న వీఐడీ ఉంటుంది.

మీ ఆధార్‌ను ఎలా లాక్ చేయాలి?

ఆధార్ నంబర్ (యుఐడి) ను లాక్ చేయడానికి మొదట ఒక విఐడి క్రియేట్ చేయాలి. వర్చువల్ ఐడి కోసం  ఎస్‌ఎం‌ఎస్ సర్వీస్ లేదా యూ‌ఐ‌డి‌ఏ‌ఐ పోర్టల్‌ ద్వారా దీన్ని ఉత్పత్తి చేయవచ్చు. మీరు వి‌ఐ‌డిని రూపొందించడానికి ఎస్‌ఎం‌ఎస్ సర్వీస్ ఉపయోగించాలనుకుంటే మొబైల్ జీవీఐడీ స్థలంలో యూఐడీ చివరి 4 లేదా 8 అంకెలను టైప్ చేసి ఈ సందేశాన్ని 1947 కు పంపాలి. తరువాత  ఎస్‌ఎం‌ఎస్ రిప్లేలో వి‌ఐ‌డి  వస్తుంది.

also read బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షాకి కరోనా పాజిటివ్‌... ...
 లాక్ / అన్‌లాక్ ఎలా చేయాలంటే
యూఐడీఏఐ ఓపెన్ రెసిడెంట్ పోర్టల్ ఓపెన్ చేసి మై అధార్ పై క్లిక్ చేసి ఆధార్ సర్వీసెస్ లోకి వెళ్ళండి. లాక్ & అన్‌లాక్ ఆప్షన్స్ కనిపిస్తాయి. యుఐడి లాక్  బటన్‌ను ఎంచుకుని, యుఐడి నెంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్‌ను ఎంటర్ చేయండి. దీని తరువాత ఓ‌టి‌పి సెండ్ ఆప్షన్ ఎంచుకోండి తరువాత  సబ్మిట్ బటన్ నొక్కండి.

మీ యుఐడి విజయవంతంగా లాక్ అవుతుంది. యుఐడిని అన్‌లాక్ చేయడానికి, మీకు తాజా వి‌ఐ‌డి నెంబర్ ఉండాలి. లేదా ఎస్ఎంఎస్ సేవ ద్వారా దీనిని పొందవచ్చు. ఆర్వీఐడీ స్పేస్ యూఐడీ చివరి 4 లేదా 8 అంకెలు టైప్ చేసి ఈ సందేశాన్ని 1947 కు పంపండి.

మీరు వీఐడీ పొందిన తర్వాత మళ్ళీ వెబ్‌సైట్‌కి వెళ్లి, అన్‌లాక్ రేడియో బటన్‌ను ఎంచుకోండి. ఇక్కడ కొత్త వీఐడీ ని ఎంటర్ చేసి, ఓటీపీ పంపి క్లిక్ చేయండి లేదా టీఓటీపీ ఎంచుని సెండ్ బటన్ నొక్కండి. దాంతో మీరు యూఐడీ విజయవంతంగా అన్‌లాక్ అవుతుంది.

ఆధార్ బయోమెట్రిక్‌లను ఎలా లాక్ / అన్‌లాక్ చేయాలి?

ఆధార్ నంబర్‌తో పాటు, ఆధార్ బయోమెట్రిక్‌లను కూడా అన్‌లాక్ చేయవచ్చు. దీని కోసం రెసిడెంట్ పోర్టల్ ఓపెన్ చేయండి. మొదట మై అధార్ తరువాత ఆధార్ సర్వీస్ కి వెళ్లి లాక్ / అన్‌లాక్ బయోమెట్రిక్స్ పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ లేదా విఐడి నంబర్‌ను నమోదు చేసిన తరువాత, క్యాప్చ్ కోడ్‌ను ఎంటర్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై ఓ‌టి‌పి పొందండి.

ఓ‌టి‌పి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. మీ బయోమెట్రిక్ లాక్ అవుతుంది. అన్‌లాక్ చేయడానికి అన్‌లాక్ బయోమెట్రిక్ పై క్లిక్ చేయండి. దీని వల్ల మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా చూసుకోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios