మహిళలు మీరు ఇంటి వద్ద ఉండే వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. బ్యూటీషియన్ కోర్స్ చేసి బ్యూటీ పార్లర్ పెట్టడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత కాలంలో యువతులు ప్రతి సందర్భంలోనూ తాము ఆకర్షణీయంగా కనిపించాలని బ్యూటీ పార్లర్లకు వెళ్లడం చూస్తున్నాము. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఈ బ్యూటీ పార్లర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కావున మీరు పెద్దగా చదువుకోకపోయినా పర్లేదు బ్యూటిషియన్ కోర్సు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. బ్యూటీషియన్ కోర్సు అలాగే బ్యూటీ పార్లర్ స్థాపించడానికి ఎంత పెట్టుబడి కావాలి లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సెట్విన్ సంస్థ జంట నగరాల్లో యువతకు స్వయం ఉపాధి శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఇందులో బ్యూటీషియన్ కోర్సును కూడా సెట్విన్ సంస్థ అందజేస్తుంది. ఈ కోర్సు చేయడం ద్వారా యువతులు స్వంతంగా బ్యూటీ పార్లర్ స్థాపించవచ్చు. లేదా మరేదైనా బ్యూటీ పార్లర్ కార్పొరేట్ సంస్థల్లో జాయిన్ కావచ్చు. బ్యూటీషియన్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహిళలు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఏ సందర్భం వచ్చిన బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నారు. అలాగే కాస్మోటిక్ వ్యాపారం కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మీరు బ్యూటీషియన్ కోర్సు చేసి మీ సొంత కాళ్లపై నిలబడే అవకాశం ఉంటుంది.
సెట్విన్ సంస్థ అధికారిక వెబ్ సైట్లో ONE YEAR DIPLOMA IN BEAUTICIAN కోర్సును అందిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి సెమిస్టర్ మూడు నెలల పాటు BASIC BEAUTICIAN కోర్సును అందిస్తారు. ఆ తర్వాత రెండో సెమిస్టర్ లో మూడు నెలల పాటు, ADVANCED BEAUTICIAN కోర్సును అందిస్తారు. మూడో సెమిస్టర్ లో ADVANCE BEAUTICIAN - HAIR DRESSING కోర్సును అందిస్తారు. ఇక నాలుగో సెమిస్టర్ లో HEALTH CARE AND SPA కోర్సును అందిస్తారు. ఈ మొత్తం కోర్సు విలువ రూ.11,000 మాత్రమే. ఆ తర్వాత మీరు స్వంతంగా బ్యూటీపార్లర్ స్థాపించుకోవచ్చు. లేదా బ్యూటీ సెలూన్లలో బ్యూటీషియన్ గా జాయిన్ కావచ్చు. తద్వారా ప్రతి నెల ఆదాయం పొందే అవకాశం మీకు ఉంటుంది.
ఇక బ్యూటీ పార్లర్ స్థాపనకు మీరు సరైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి ఒకవేళ మీరు ఉన్నటువంటి ప్రదేశము జన సమర్థత ఉన్న ప్రాంతం అయినట్లయితే మీ ఇంట్లోనే ఒక గదిని బ్యూటీ పార్లర్ కోసం కేటాయించుకోవచ్చు. లేదా ఒక షాపును రెంటుకు తీసుకొని బ్యూటీ పార్లర్ తెరవాల్సి ఉంటుంది. బిజినెస్ పెరిగే కొద్దీ సహాయకులను ఉంటుంది. బ్యూటీ పార్లర్ డిజైన్ కోసం కార్పెంటర్ను సంప్రదించి అద్దాలు అలాగే మీకు కావాల్సిన ఫర్నిచర్ ను తయారు చేయించుకోవాలి. ఆ తర్వాత సెలూన్ కుర్చీలను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మెని క్యూర్, పెడిక్యూర్ చేసేందుకు వస్తువులను కొనుగోలు చేసుకోవాలి. బ్యూటీ పార్లర్ లో లైటింగ్ అనేది చాలా ముఖ్యమైనది అందుకే ఎక్కువ పెద్ద ఎత్తున లైట్లు ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మొత్తం పెట్టుబడి దాదాపు ఒక లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇక బ్యూటీ పార్లర్ ద్వారా ప్రతిరోజు కనీసం 2000 నుంచి 5000 రూపాయలు సంపాదించుకోవచ్చు. డిమాండ్ బాగా ఉంటే ప్రతిరోజు కనీసం పదివేల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ఖర్చులు పోను ప్రతినెల లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.