మీ బాబు 18 సంవత్సరాలు వచ్చే సమయానికి ఉన్నత చదువు కోసం రూ. 1 కోటి కూడబెట్టడమే లక్ష్యమా..అయితే ఈజీ పద్ధతి మీకోసం
How to become Crorepati: ఒక కోటి రూపాయలు సంపాదించడం అనేది భారతీయులకు మానసికంగా ఆర్థిక భరోసా ఇచ్చే నెంబర్ అనే చెప్పాలి. ఒక కోటి రూపాయలు ఉంటే చాలు జీవితం హాయిగా గడిపేయొచ్చు అనుకునే భారతీయులు చాలామంది ఉంటారు. అందుకే ఒక కోటి రూపాయలు సంపాదించడం అనేది మైలురాయిగా పెట్టుకొని భారతీయులు పనిచేస్తూ ఉంటారు. అయితే మీ పిల్లవాడి పేరిట పుట్టినప్పటినుంచి 18 సంవత్సరాలు వచ్చే వరకు కొన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా అతడు ఉన్నత విద్య చేరుకునే సమయానికి కోటి రూపాయలను చేతికి ఇవ్వవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
How to become Crorepati: పిల్లవాడికి 18 సంవత్సరాలు వచ్చే నాటికి అతని పేరిట ఒక కోటి రూపాయలు జమ చేయాలని మీరు భావిస్తున్నారా. అయితే ఈ చిన్న సింపుల్ మెథడ్ పాటించడం ద్వారా మీరు పిల్లవాడి పేరిట ఒక కోటి రూపాయలను ఈజీగా కూడా పొదుపు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టండి..
పిల్లల పేరిట ఆస్తుల్ని కొనుగోలు చేయడం ద్వారా సాధారణంగా వారు యుక్త వయసు వచ్చేనాటికి మంచి విలువ దక్కుతుందని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే పిల్లవాడి పేరిట మంచి లొకేషన్ లో భూమిని కొనుగోలు చేస్తే 18 సంవత్సరాల తర్వాత దాని విలువ కోట్లల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం భారతదేశంలో వేగంగా విస్తరిస్తోంది. భూముల విలువలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణీకరణ ఫలితంగా నగరాలకు వలస వెళ్తున్నారు ఈ నేపథ్యంలో నగరాలకు సమీపంలో ఉండే భూముల విలువ భారీగా పెరుగుతుంది అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో పిల్లవాడి పేరిట ఒక స్థలం కొనుగోలు చేసి, 18 సంవత్సరాల వరకు వేచి చూస్తే దాని విలువ చాలా రెట్లు పెరిగి అతని చదువు పూర్తయ్య నాటికి కోట్ల రూపాయల డబ్బు పిల్లవాడికి సొంతం అయ్యే అవకాశం ఉంటుంది.
బంగారం కొనుగోలు చేయండి..
గడచిన రెండు దశాబ్దాలుగా మనం గమనించినట్లయితే బంగారం ధర భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా బంగారం ధర గడచిన 20 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే దాదాపు 15 రెట్లు పెరిగింది 2000 సంవత్సరంలో బంగారం ధర 10 గ్రాములు రూ. 4000 మాత్రమే ఉండేది. ఇప్పుడు దాని ధర దాదాపు 62000 దాటింది. అంటే ఏ రేంజ్ లో బంగారం ధర పెరిగిందో మీరు గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మీరు మీ పిల్లవాడి పేరిట 2000 సంవత్సరంలో సుమారు రూ. 6,00,000 పెట్టుబడితో బంగారం కొనుగోలు చేసి ఉంటే, ప్రస్తుతం ధరతో మనం పోల్చి చూసినట్లయితే దాదాపు కోటి రూపాయలు అయి ఉండేది. అంటే మీ పిల్లవాడు చదువు పూర్తి చేసుకుని సమయానికి కోటి రూపాయలు బహుమతిగా ఇచ్చి ఉండేవారు.
మ్యూచువల్ ఫండ్స్ సరైన మార్గం..
ఇక చివరగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి సరైన మార్గం అనే చెప్పాలి ఎందుకంటే. మనం వద్ద ఒకేసారి పెద్ద మొత్తంలో మూలధనం ఉండదు. పెద్ద మొత్తంలో మూలధనం లేకపోతే మనం బంగారం కానీ భూములు కానీ కొనలేము. ఈ నేపథ్యంలో మీ పిల్లవాడి పేరిట 18 ఒక కోటి రూపాయలు ఎలా కూడా పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? ఏమాత్రం చింతించకండి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా పిల్లల భవిష్యత్తుకు చక్కటి నిధిని ఏర్పాటు చేయవచ్చు. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్ సిప్ క్యాలిక్యులేటర్ ప్రామాణికంగా తీసుకొని మనం అంచనా వేసినట్లయితే నెలకు 15 వేల రూపాయలను, 12 శాతం కాంపౌండ్ వడ్డీతో, 18 సంవత్సరాలు పెట్టుబడి పెట్టినట్లయితే సుమారు రూ.1,14,81,589 వరకూ కూడబెట్టే అవకాశం ఉంది. పైగా మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతినెల SIP పద్ధతిలో ఫొదుపు చేసుకునే వీలుంది.