Asianet News TeluguAsianet News Telugu

Budget 2020: బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.5లక్షలకు పెంపు

బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

Budget2020: Bank Deposit Insurance To be Hiked To Rs 5 lakh
Author
Hyderabad, First Published Feb 1, 2020, 1:01 PM IST

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో  పలు విషయాలపై దృష్టిసారించారు. దీనిలో భాగంగా బ్యాంకులో డిపాజిట్లు  చేసేవారికి శుభవార్త తెలియజేశారు. బ్యాంకు డిపాజిట్లపై బీమా ను పెంచారు.

బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 

ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే.. సదరు బ్యాంకు కస్టమర్లకు అసలు మొత్తం, వడ్డీలపై రూ.1 లక్ష వరకు ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. 

దివాళా తీసిన బ్యాంకుల్లో వినియోగదారుల సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు,రికరింగ్ డిపాజిట్ ఖాతాలతో సంబంధం లేకుండా రూ. 1 లక్ష వరకు ఇన్సూరెన్స్‌ను వర్తింపజేసేది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఇన్సూరెన్స్‌ను ‌ కేంద్రం రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. 

దాదాపుగా 25 ఏళ్ల తర్వాత ఈ పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. 1993లో ఈ లిమిట్‌ను పెంచారు. 1993తర్వాత ఇప్పుడే ఈ లిమిట్‌ను పెంచారు. గతంలో ఈ పరిమితిని రూ. 30 వేలు ఉండేది. 

అయితే బ్యాంకు డిపాజిటర్లకు  ఇన్సూరెన్స్‌ను రూ. 2 లక్షలకు పెంచాలని అధికారులు కేంద్రానికి ప్రతిపాదించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకే సారి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి  మొండి బకాయిల నేపథ్యంలో  బ్యాంకుల్లో తాము దాచుకొన్న డబ్బులను కూడ డ్రా చేసుకోలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో  ఆర్‌బీఐ ఈ ప్రతిపాదనలను తీసుకొచ్చింది.

పన్ను అధికారుల వేధింపులను సహించమని చెప్పారు.  కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ చేస్తామన్నారు.  2022లో భారత్‌లో జీ 20 సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  రూ 100 కోట్లతో సన్నాహక ఏర్పాట్లు చేస్తామన్నారు.

సహకార బ్యాంకుల పరిపుష్టి చేస్తామన్నారు.  గిఫ్ట్‌ సిటీలో ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ చేస్తామన్నారు. షేర్ల అమ్మకం ద్వారా ఎల్‌ఐసీలో​ప్రభుత్వ వాటా పాక్షిక విక్రయం చేస్తుందన్నారు. ఐడీబీఐ బ్యాంకులోని ప్రభుత్వ వాటా అమ్మకాలు చేపడుతుందన్నారు. 2021లో జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  వచ్చే సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 10శాతం వరకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

కాగా గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా స్కీమ్స్ ప్రవేశపెట్టారు.  ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం చేస్తామన్నారు. గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు. నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తామని చెప్పారు.

ఇక ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కూడా పెద్ద పీట వేశారు. రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇస్తామని చెప్పారు.  వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు  చెప్పారు.  పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. 
ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు,  స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ఆమె వివరించారు.

కాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది.

Follow Us:
Download App:
  • android
  • ios