కాలుష్యం సాకుతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల మూత: 3 లక్షల కొలువులు హాంఫట్!
ఆరు రాష్ట్రాల పరిధిలో 14 థర్మల్ విద్యుత్ ఉత్పాదక యూనిట్లకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో దీని విషయమై స్పందించాలని సంబంధిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఆదేశించారు.
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కీలక బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల మూసివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు సమర్పించారు.
బొగ్గు ఆధారితంగా నడిచే దాదాపు 1.66లక్షల మెగావాట్ల సామర్థ్యం కల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ల మూసివేసే దిశగా బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు ఉన్నాయని విద్యుత్ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ ప్లాంట్లు ఉన్నాయని వీరు చెబుతున్నారు.
ఈ మేరకు కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటించడంలో విఫలం అయ్యారని పేర్కొంటూ ఆరు రాష్ట్రాల పరిధిలో 14 థర్మల్ విద్యుత్ ఉత్పాదక యూనిట్లకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో దీని విషయమై స్పందించాలని సంబంధిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఆదేశించారు.
దీనికి తోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాలలో ఉన్న దాదాపు 15వేల మెగా వాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ సంస్థలనూ సర్కార్ మూసివేసే ఆస్కారం ఉందని ఇంజినీర్ల కథనం. ఆయా థర్మల్ విద్యుత్ తయారీ కేంద్రాలను మూసివేయడానికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబేను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.
విద్యుత్ రంగానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన పలు అంశాలు పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా గాను, కార్పొరేట్ రంగంలోని పెద్దలకు మేలు చేసేలా ఉన్నాయని ఏఐపీఈఎఫ్ ఆరోపించింది.
థర్మల్ ప్లాంట్ల మూసివేత దిశగా సర్కారు ఏవైనా చర్యలు చేపడితే వాటిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే హెచ్చరించారు. బడ్జెట్‌లో ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగంలోని ఉద్యోగులు మంగళవారం నిరసనకు దిగనున్నట్టు తెలిపారు.
దీనికి తోడు భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం ఏఐపీఈఎఫ్ జాతీయ కార్యవర్గం చెన్నైలో సమావేశం కానుందని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే తెలిపారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న పాత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇతర ప్లాంట్ల కంటే చాలా తక్కువకు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే అన్నారు. వీటిని వివిధ సాకులతో మూసి వేయాలన్నది సర్కారు ప్లాన్‌గా కనిపిస్తోందని తెలిపారు.
ఈ ప్లాంట్‌ల మూసివేత కారణంగా ఏర్పడే విద్యుత్ లోటును పూడ్చుకొనేందుకు పంపిణీ సంస్థలు బలవంతంగా ప్రయివేటు ఆధ్వర్యంలోని విద్యుత్ ప్లాంట్‌ల నుంచి కరెంటును కొనుగోలు చేయించాలన్నది సర్కారు ప్లాన్‌గా తెలుస్తోందని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే ఆరోపించారు.
పంపిణీ సంస్థలు అధిక ధరలకు ప్రయివేటు నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఆయా సంస్థలు అధిక మొత్తంలో చెల్లింపులు జరపాల్సి వస్తుందని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే అన్నారు. ఈ భారాన్ని పంపిణీ సంస్థలు దీర్ఘకాలం భరించలేవని, ఫలితంగా ఆయా సంస్థలు కరెంటు చార్జీలను పెంచాల్సిన పరిస్థితులు నెలకొంటాయన్నారు.
దీంతో సామాన్య ప్రజలపై విద్యుత్ భారం పడుతుందని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులకు ప్రాంగణాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని సర్కార్ బడ్జెట్‌లో ప్రతిపాదించిందని దూబే తెలిపారు.
Also read:కరోనా ఎఫెక్ట్: ముడి సరుకుకొరత..సవాళ్ల ముంగిట ఫార్మా ఇండస్ట్రీ
దీనికి తోడు తమకు ఇష్టం వచ్చిన సప్లయర్స్ నుంచి విద్యుత్‌ను కొనే వెసులుబాటును కల్పించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిందని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే అన్నారు. విద్యుత్ పంపిణీని పూర్తిగా ప్రయివేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకే సర్కారు ఇలాంటి నిర్ణయాలతో ముందుకు వస్తోందన్నారు.
ఈ నిర్ణయాలతో మీటర్ రీడింగ్, బిల్లులు కలెక్ట్ చేసే వారితోపాటు ఈ రంగంలోని ఇతర సిబ్బంది కొలువులు కొండెక్కే పరిస్థితి కనిపిస్తోందని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు బడ్జెట్ నిర్ణయాల కారణంగా దాదాపు 3 లక్షల ఉద్యోగుల ఉపాధికి గండిపడే అవకాశం ఉందని ఆయన అన్నారు.