కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని ఆమె స్వయంగా చదవి వినిపించారు. కాగా... ఈ బడ్జెట్ లో ఆమె ఎఫ్ డీఐ( విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) గురించి కూడా ప్రస్తావించారు.

విమానయానం, మీడియా, యానిమేషన్, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల పెంపునకు అంగీకారం తెలుపుతున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఇంటర్ మీడియరిస్ కు 100 శాతం ఎఫ్ డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కు ఆమోదం తెలుపుతున్నట్లు చెప్పారు. 
ఒకే బ్రాండ్ కు చెందిన రిటైల్ సెక్టార్ లో ఎఫ్ డీఐలకు నిబంధనలు సరళతరం చేస్తున్నామని వివరించారు.

న్యూస్ ఛానల్స్ మరియు ప్రైవేట్ ఎఫ్ఎమ్ రేడియోలలో  ఎఫ్ డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు,వినోద ఛానెళ్లలో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించారు. కానీ ప్రింట్ మీడియాలో మాత్రం ఎలాంటి మార్పులేదు.