Budget 2024 : పేపర్ లెస్ బడ్జెట్ ను ఎక్కడ చదవొచ్చు? ఏ యాప్ లో అందుబాటులో ఉంటుంది?
బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత బడ్జెట్ పత్రాలు మొబైల్ యాప్‌లో తక్షణమే అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ను పూర్తిగా చదవాలనుకునే వారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఢిల్లీ : బడ్జెట్ ఇప్పుడు పేపర్ లెస్ అయిపోయింది. టెక్నాలజీని అందిపుచ్చుకుని అధునాతనంగా మారింది. గత కొంతకాలంగా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఈ సారి మధ్యంతర బడ్జెట్ కూడా టాబ్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఈ బడ్జెట్ పేపర్లను చదవాలంటే ఎలా.. ఏ యాప్ లో అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలను ఎలా తెలుసుకోవచ్చు.. అంటే...
మధ్యంతర బడ్జెట్ 2024ను యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా "పేపర్‌లెస్ ఫారమ్"లో యాక్సెస్ చేయవచ్చు. ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో అందుబాటులో ఉన్న ద్విభాషా యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.indiabudget.gov.in) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ భారత ప్రభుత్వ యాప్ రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన వార్షిక ఆర్థిక ప్రకటన, గ్రాంట్ల డిమాండ్, ఫైనాన్స్ బిల్లుతో సహా అన్ని అవసరమైన బడ్జెట్ పత్రాలను అందుబాటులో ఉంచుతుంది.
Budget 2024 : ఓట్ ఆన్ అకౌంట్ కు అంతా సిద్ధం..
అయితే, ఈ బడ్జెట్ ను ఆర్థికమంత్రి సభలో ప్రవేశపెట్టి, ప్రసంగించిన తరువాతే యాప్ లో అందరికీ అందుబాటులోకి వస్తాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత బడ్జెట్ పత్రాలు మొబైల్ యాప్‌లో తక్షణమే అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ను పూర్తిగా చదవాలనుకునే వారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇక ఇప్పటికే, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు లాక్ ఇన్ పీరియడ్ లో ఉన్న తన బృదంతో కలిసి నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఈ క్రమంలో తాము తయారు చేసిన మధ్యంతర బడ్జెట్ తో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం ఫొటో దిగారు. ఈ మధ్యంతర బడ్జెట్ పేపర్ లెస్ గా ఉండబోతోంది. గత కొంతకాలంగా టాబ్ లో బడ్జెట్ ను పేపర్ లెస్ గా సమర్పిస్తున్నారు.
ఈ మధ్యంతర బడ్జెట్ తో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే వరకు తాత్కాలిక ఆర్థిక ప్రణాళికకు వేదికను ఏర్పాటు చేయనున్నారు. నిర్మలా సీతారామన్ కు ఇదో ఆరవ బడ్జెట్ సమర్పణ. ఇప్పటివరకు ఐదు వార్షిక బడ్జెట్ లను సమర్పించారు. ఈ మధ్యంతర బడ్జెట్ సమర్పణతో ఆమె మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌తో సమానంగా వరుసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పించిన రెండో వ్యక్తిగా నిలవనున్నారు. ఈ బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రెండవ టర్మ్ లో నిశ్చయాత్మక బడ్జెట్‌ను కూడా సూచిస్తుంది. బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు ప్రస్తుతం 'లాక్-ఇన్' పీరియడ్ లో ఉన్నారు. బడ్జెట్ సమర్పణ తరువాత వీరు దీనినుంచి బయటికి వస్తారు.